Close

రైతుల ఇంటివద్దకే వెళ్ళి ప్రభుత్వం రూపొందించిన పంచ సూత్రాలను వివరించి వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుకున్న ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి , దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

Publish Date : 16/03/2026

పెదవేగి, మార్చి 16: “వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ, ప్రతి రైతుకు ఆర్థిక అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన పంచ సూత్రాలను “రైతన్నా, మీకోసం” కార్యక్రమం ద్వారా రైతులకు చేరువ చేస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి గారు, దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు..

పెదవేగి మండలం పెదవేగి గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన “రైతన్నా…మీకోసం” కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి గారు, దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పెదవేగి గ్రామానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి గారికి దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి మర్యాద పూర్వక స్వాగతం పలికారు. అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి గారు, దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు పెదవేగి గ్రామంలోని పలువురు రైతుల ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను, రైతన్న మీకోసం కార్యక్రమం విశిష్టతను, ప్రభుత్వం రూపొందించిన పంచ సూత్రాల ప్రాముఖ్యతను స్వయంగా వివరించారు..కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలను వివరించడంతోపాటు స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద విడతల వారీగా రైతులకు డబ్బులు అందాయా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను కూడా తెలుసుకుంటూ,రైతు సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి గారు మాట్లాడుతూ ” ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా ఉంటుందని, రైతులకు సాంకేతికను చేరువ చేస్తూ ఇప్పటికే డ్రోన్ పరికరాలను సైతం సబ్సిడీపై అందించడం జరిగిందని, పెదవేగిలో రైతులకు సాగు నీటి సమస్య ఉన్నట్టు గుర్తించామని, జిల్లాలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం ఇప్పటివరకు అందని అర్హత కలిగిన రైతుల సాంకేతిక సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి కోరినట్లు న్యాయంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రూపకల్పన తో పాటు విజ్జేశ్వరం నుంచి కాకుండా సమీపంలోనే ఉన్న పోలవరం రైట్ మెన్ కెనాల్ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించడం వంటి అంశాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. రైతులు స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని తద్వారా సాంకేతికతను అందికొచ్చుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అందిపుచ్చుకోవచ్చు అని జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి గారు తెలిపారు…

*”దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ ” వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలను ప్రతి రైతుకు చేరవేసే లక్ష్యంతో “రైతన్నా… మీ కోసం” కార్యక్రమం నిర్వహించటం జరిగిందని, కార్యక్రమం వారోత్సవాల్లో భాగంగా ఏడు రోజులు పాటు దెందులూరు నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రైతులకు పంచ సూత్రాల ప్రాముఖ్యతను వివరిస్తామని ప్రతిరోజు తాను కూడా స్వయంగా పలు గ్రామాల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు.
పెదవేగి అంటే చారిత్రక కాలం నుంచి ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమని, వేంగి రాజులు పరిపాలించిన ప్రాంతంగా పెదవేగి ఎంతో ప్రాముఖ్యత కలిగిందని, అటువంటి పదవికి గ్రామం నుంచి ఈ రైతన్న మీకోసం వారోత్సవాల కార్యక్రమం ప్రారంభించడం ఎంతో గర్వకారణం అని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం అందుకొని అర్హత కలిగిన రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా జిల్లా కలెక్టర్ గారు చర్యలు చేపట్టాలని కోరారు. రాబోయే రోజుల్లో దెందులూరు నియోజకవర్గంలో 500 ఎకరాల్లో కోకో సిటీ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. పెదవేగి మండలం న్యాయంపల్లి వద్ద లిఫ్టు ఇరిగేషన్ పథకం ద్వారా రైతులకు మరింత ఉపయోగ ఉంటుందని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, 2014 19 కాలంలో దెందులూరు నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకున్న ఎంతో మంది పేద వారూ బిల్లులు పడక ఎంతో ఇబ్బంది పడుతున్నారని , వారికి సత్వరమే పెండింగ్ బిల్లులు అందించేలా సహకరించాలని, జల జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్న త్రాగునీటి సరఫరా కార్యక్రమంలో విజ్జేశ్వరం నుంచి గోదావరి జలాలను దెందులూరు నియోజకవర్గానికి తరలించడానికి బదులుగా సమీపంలోనే ఉన్న పోలవరం రైట్ మెన్ కెనాల్ నుంచి గోదావరి జలాలను ప్రజలకు త్రాగునీరుగా ఇంటింటికి పైప్ లైన్ ద్వారా అందించడం ద్వారా ఈ ప్రాజెక్టు రూ. 280 కోట్ల రూపాయలతోనే పూర్తవుతుందని తద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.100 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని, ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ గారిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు కోరారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూ అన్ని రంగాల ప్రజలకు అండగా నిలుస్తుందని, రైతులు ,మహిళలు, పారిశ్రామికవేత్తలు , యువత విద్యార్థులు సహా అన్ని రంగాల ప్రజలు కూటమి ప్రభుత్వంలో సుపరిపాలనను అందుకుంటున్నారని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు..*

*ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ గారపాటి రామసీత గారు, గ్రామ సర్పంచ్ తాతా శ్రీరామమూర్తి గారు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ భాషా గారు, రెవెన్యూ డివిజనల్ అధికారి దేవకి గారు, వడ్డీ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బోప్పన సుధా గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్ గారు, మండల పార్టీల అధ్యక్షులు ఈడుపుగంటి అనిల్ గారు, మరడాని రవి గారు, నంబూరి నాగరాజు గారు, పెదవేగి సొసైటీ చైర్మన్ తాతా సత్యనారాయణ గారు, ముండూరు సొసైటీ చైర్మన్ కొనకళ్ళ శివమణి గౌడ్ గారు, లక్ష్మీపురం సర్పంచ్ మేక కనకరాజు గారు, నియోజకవర్గ తెలుగు రైతు విభాగం అధ్యక్షులు విశ్వనాథం గారు, తహసిల్దారులు బత్తిన సుమతి గారు, కృష్ణ జ్యోతి గారు, విజయ్ కుమార్ గారూ , వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ అనిల గారు సహా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పలు సహకార సొసైటీల చైర్మన్లు, నీటి సంఘాల చైర్మన్లు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జులు సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..