రోడ్డు పనులు పరిరక్షణలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు/దెందులూరు, నవంబర్, 19: పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో చేపట్టిన సిసి రోడ్ల పనులను నాణ్యత ప్రమాణాలు కలిగివుండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం దెందులూరు మండలం మలకచర్ల నుండి గండివారిగూడెం మీదుగా సూరప్పగూడెం వెళ్లే రహదారి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సిసి రోడ్ల నిర్మాణంలో ఇచ్చిన మార్గదర్శకాలను తు.చ తప్పకుండా అధికారులు అవలంబించాలని, రోడ్డు నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. అధికారులు క్షేత్రస్ధాయిలో పనుల పరిరక్షణ, బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని పరిరక్షణ బాధ్యతలో అలసత్వం వహించినా, సిసి రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లేకపోయినా సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్, రోడ్డు వెడల్పు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనుల్లో గ్రామ ప్రజల నుంచి ఎటువంటి పిర్యాదులు లేకుండా రోడ్డు నిర్మాణం జరగాలని సూచించారు.
కలెక్టర్ వెంట తహశీల్దారు, యంపిడివో, పంచాయితీరాజ్, డ్వామా తదితర అధికారులు ఉన్నారు.