లాటరీ ప్రక్రియ ద్వారా జనరల్ మరియు గీత కులాలకు 10 బార్ల కేటాయింపు లాటరీ తీసి బార్ల కేటాయింపు చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరు,ఆగస్టు 30: 2025 – 28 సంవత్సర కాలానికి జనరల్ గీత కులాలకు రిజర్వ్ చేసిన మద్యం బార్లకు శనివారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి లాటరీ తీసి పేర్లను ప్రకటించడం జరిగింది.
ఏలూరు జిల్లా నందు నూతన బార్ బార్ పాలసీ 2025- 28 భాగంగా ప్రభుత్వం వారు కేటాయించిన ఓపెన్ కేటగిరీలో 18 బార్లు మరియు రిజర్వ్ కేటగిరీ కింద గీత కులాలకు రెండు బార్లు మొత్తం 20 బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, పది బార్లకు మాత్రమే 4 మించి ఎక్కువ 52 దరఖాస్తులు రావడం జరిగింది. మిగిలిన బార్లకు ప్రభుత్వ మార్గదర్శ మేరకు దరఖాస్తులు రా. ఎనిమిది ఓపెన్ క్యాటగిరి బార్లు మరియు రిజర్వ్ కేటగిరి కింద గీత కులాలకు రెండు బార్లకు మొత్తం పది బార్లకు దరఖాస్తులు అందాయి.
ఈ మేరకు సంబంధిత బార్ల కేటాయింపుకు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి తద్వారా బార్లను కేటాయించారు. ఈ సందర్భంగా లాటరీ ద్వారా ప్రభుత్వం వారికి రు. 4.30 కోట్లు ఆదాయం సమకూరింది.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి. శ్రీలత, జిల్లా మధ్య నిషేధ మరియు అబార్కిఅధికారి ఏ. ఆవులయ్య, ఏలూరు ఎక్సైజ్ సీఐలు ,ఏలూరు ,నూజివీడు,జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కైకలూరు ఈ ఎస్ టి ఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐలు బార్లకు దరఖాస్తు చేసిన 52 మంది అభ్యర్థులు హాజరయ్యారు.