Close

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ -2026

Publish Date : 27/09/2025

ఏలూరు, సెప్టెంబరు,27: భారత యువజన సర్వీసుల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్ వారి నుండి 2026 జనవరి 12వ తేదిన జరుగబోవు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని విభిన్న సాంస్కృతి, సామాజిక నేపధ్యంలో యువతను ఏకం చేయడానికి, విబివైఎల్ డి-2026 ద్వారా ఐదు ప్రధాన ట్రాక్ లలో వాస్తవ ప్రపంచ అభివృద్ధి సవాళ్లకు వినూత్నమైన, ఆచరణాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి బహుళ-స్థాయి సవాలులో యువ ఆవిష్కర్తలను సమీకరించి, జాతీయ సమైక్యత, యువ సాధికారతను పెంపొందించడానికి యువతను నిమగ్నం చేయడం ద్వారా వారిలో నూతన ఆవిష్కరణలు పెంపొందించడం యువతను విక్షిత్ భారత్ @2047 మిషన్ లో పాల్గొనేలా చేయాలనే లక్ష్యంతో ఒక ప్రధాన వేదికగా 15 నుండి 29 సంవత్సరముల వయస్సు గల యువతను నిమగ్నం చేసే లక్ష్యంతో భారత యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రత్యేక వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పోటీల కార్యక్రమాన్ని రూపొందించామని సెట్ వెల్ సిఇఓ ప్రభాకర్ శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వికసిత్ భారత్ చాలంజ్ ట్రాక్ క్రింద సెప్టెంబర్-2025 1వ తేది నుండి అక్టోబర్-2025 15వ తేది వరకు జాతీయ స్థాయిలో ఆన్ లైన్ ద్వారా వికసిత్ భారత్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్విజ్ లో యువత పెద్దసంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించాలని విస్తృతంగా ప్రచారం చేయమని జిల్లా అధికారులను, పంచాయతీ రాజ్ సంస్థలు, జిల్లా పరిషత్ లు మరియు వాటి పరిధిలోని అన్ని సంబంధిత విభాగాలను మరియు విద్యా విభాగపు అధికారులను కోరామన్నారు.
ఈ పోటీలలో పాల్గొనే వారు https://mybharat.gov.in/quiz పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో ఈ పోటీలలో పాల్గొనవచ్చును.