Close

వికసిత భారత్ – 2047 కలను సాకరం చేసేందుకు మహిళలు భాగస్వామ్యం అత్యంత కీలకం. మంత్రితో పాటు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు.

Publish Date : 02/07/2026

ఏలూరు/ముసునూరు, జూలై 02: ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో గురువారం వికసిత భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) {VB-G RAM G} అమలు కార్యక్రమాన్ని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, కమలాలక్ష్మీ దంపతులు, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి కలిసి ఫీడర్ ఛానల్ పనులను గుణపంతో త్రవ్వి, భూమి పూజలు చేసి, లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గ్రామసభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ వికసిత భారత్ -2047 కలను సాకరం చేసేందుకు మహిళలు భాగస్వామ్యం అత్యంత కీలకం మని అన్నారు. రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) పథకం పల్లెసీమలు ప్రగతికి గొప్పవరం అని, ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు అవగాహన పెంచుకుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) లేదా VB-G RAMG అనేది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త గ్రామీణ ఉపాధి, సంక్షేమ కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి అర్హత గల గ్రామీణ కుటుంబానికి సంవత్సరంలో 125 రోజులు వేతన ఉపాధికి చట్ట బద్ధమైన హామీని ఇస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి కుటుంబానికి 125 రోజులు పాటు ఉపాధి కల్పిస్తారని, వ్యవసాయ పనులు సమయంలో ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుస్తు ప్రకటన ద్వారా 60 రోజులు పాటు పనులను తాత్కాలికంగా నిలిపివేసే వెసులుబాటు ఉంటుందని అన్నారు. మిగిలిన 305 రోజుల్లో 125 రోజులు ఉపాధి హామీ అందుబాటులో ఉంటుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యనిధులు వాటా 60:40 నిష్పత్తిలో ఉంటుందని అన్నారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడం దీనిలో ఒక ముఖ్యమైన భాగం అని, సాంకేతికత, పారదర్శకత కోసం సోషల్ ఆడిట్‌ను, సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడంతో పాటు, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే (వికసిత్ భారత్ 2047) లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, ప్రజలు, గ్రామాలు ఆస్తులు సృష్టి జరుగుతుందని అన్నారు .

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, గ్రామీణాభివృద్ధి లక్ష్యాలుపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాలు సద్వినియోగం, సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను విపులంగా వివరించారు. గ్రామీణ మహిళలు, యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. అర్హత ఉండి అడిగిన వారందరికీ జాబు కార్డులు, పనిదినాలు కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ఉపాధి, జీవనోపాధి పథకాల ద్వారా లబ్ధిదారులు ఆదాయాన్ని పెంచుకోవాలని అన్నారు. స్వయం సహాయక సంఘాలు సభ్యులకు అందుబాటులో ఉన్న శిక్షణా కార్యక్రమాలు, రుణ సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ కుటుంబాలు అభివృద్ధికి రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ కీలక వేదికగా నిలుస్తుందని తెలిపారు. గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడి సెంటర్లు, సోలార్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఈ కార్యక్రమంలో ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, డ్వామా పిడి కె.వెంకట సుబ్బారావు, జిల్లా ఉద్యానవన శాఖ కె.షాజా నాయక్, అడిషనల్ పిడి యం.రాజ శేఖర్, డిఎల్డివో, అసిస్టెంటు పిడి పి.శ్రీనివాస రావు, వివిధ శాఖలు అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, రైతులు మహిళా రైతులు, కౌలు రైతులు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.