విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుని అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ చెప్పారు. స్థానిక శ్రీమతి ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక హైస్కూల్ లో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశంలో జేసీ పాల్
ఏలూరు, డిసెంబర్, 5 : విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుని అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ చెప్పారు. స్థానిక శ్రీమతి ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక హైస్కూల్ లో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా పురోగతి కోసం ప్రజల భాగస్వామ్యం ముఖ్యంగా తల్లితండ్రుల పాత్ర మెగా పిటిఎంలో కీలకమని, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాలల మద్య బంధాన్ని బలోపేతం చేయడానికి పేరెంట్స్, టీచర్స్ సమావేశం వేదికగా పనిచేస్తోందన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పును తీసుకురాగలమన్నారు. ప్రతీ తల్లితండ్రులు తమ పిల్లలకు ఉన్నత విద్య అందించేందుకు కృషి చేయాలన్నారు. తల్లితండ్రులు తమ పిల్లల అభ్యాసన సామర్ధ్యాన్ని తెలుసుకోడానికి , వాటిలో లోపాలను ఉపాధ్యాయులతో సరిదిద్దెందుకు అవకాశం ఉంటుందన్నారు. తమ పిల్లలు ఏ ఏ సబ్జెక్టు లలో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని, వాటిపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవచ్చని, దీని కారణంగా నూరుశాతం ఉత్తీర్ణతా ఫలితాలు కలుగుతాయన్నారు. ప్రతీ విద్యార్థికీ 10వ తరగతి ఉత్తీర్ణత ఎంతో కీలకమని, విద్యార్థులకు వారి ఉజ్వల భవిష్యత్తుకు తీసుకోవలసిన ఎంపికలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు దిశా నిర్దేశం చేయాలన్నారు. మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమావేశంలో విద్యార్థుల విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాన్ని సమీక్షించుకోవడంతోపాటు, వారి శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితులను గురించి కూడా చర్చిండం జరుగుతుందన్నారు.
అనంతరం విద్యార్థులు, వారి తల్లితండ్రులకు భోజనాన్ని జేసీ అభిషేక్ గౌడ స్వయంగా వడ్డించి, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
కార్యక్రమంలో విద్యా శాఖ, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.