వీసీ సమీక్ష ద్వారా ప్రత్యేక సిఎస్ జి.సాయిప్రసాదు, ల్యాండు అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనరు జి.జయలక్ష్మిలకు, జిల్లా ప్రగతిని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి వివరించారు …
ఏలూరు, ఫిబ్రవరి 24: జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ఛాంబరు నుండి మంగళవారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు. జలవనరులు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు ముఖ్యమంత్రికి ఎక్స్- అఫీషియో ప్రత్యేక సిఎస్ జి.సాయి ప్రసాదు, ల్యాండు అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనరు జి.జయలక్ష్మి సంయుక్తంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భూ హక్కులు ధృవీకరణ, రైతులకు భద్రత కల్పించడం, రీ సర్వే సంబంధిత లోపాలను సరిదిద్దడం లక్ష్యంగా పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లకు వివరించారు.
అమరావతి నుంచి జలవనరులు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు ముఖ్యమంత్రికి ఎక్స్- అఫీషియో ప్రత్యేక సిఎస్ జి.సాయిప్రసాదు, ల్యాండు అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనరు జి.జయలక్ష్మి సంయుక్తంగా మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ, రీసర్వే ప్రగతి అంశాలుపై మరింత వేగవంతం చెయ్యాలని, పి జి ఆర్ ఎస్ రెవెన్యూ క్లినిక్లు ముటేషన్లు, ఐవీఆర్ఎస్ సేకరణ రెవెన్యూ డిజిటల్ రికార్డుల రూపకల్పన పురోగతి అంశాలుపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ ప్రక్రియను పూర్తి చెయ్యాలని సూచించారు. ఈకేవైసీ పూర్తి చెయ్యాలని ప్రతి రెండు రోజులకు సంబంధించిన ప్రగతి నివేదికలను జిల్లా కలెక్టర్లుకు సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రీసర్వే, మ్యూటేషన్, 1బి నమోదు తదితర అంశాలుపై వివరించారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన 182 గ్రామాల్లో 79,500 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ పంపిణీ చెయ్యడం జరిగిందని వివరించారు. మార్చి నెలలో మరో పది గ్రామాల్లో పంపిణీ చేస్తామని, ఇప్పటివరకు ప్రతి నెల నియోజకవర్గంలో రెండు గ్రామాలు చొప్పున ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నామని అన్నారు. రానున్న ఏప్రిల్ మాసం నుండి నియోజక వర్గాలు వారి మరిన్ని గ్రామాలలో పంపిణీ చేసేందుకు కార్యచరణను రూపొందించటం జరిగిందన్నారు. మ్యూటేషన్, డెత్ వంటి కారణాలు వల్ల సమస్యలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. లబ్ధిదారులకు బయోమెట్రిక్ విధానంలో పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 24 మండలాలకు సంబంధించి 248 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియను ప్రారంభించగా పేజ్-1లో 24 గ్రామాలు, పేజ్ -2 లో 30 గ్రామాలు, పేజ్-3 లో 59 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియను పూర్తి చేశామన్నారు. పేజ్-4 లో జరుగుతున్న 40 గ్రామాల్లో రీ సర్వే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. ఏప్రిల్ 02వ తేదీ నాటికి పూర్తి చెయ్యడం జరుగుతుందని జిల్లా కలెక్టరు వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో నూజివీడు ఇంచార్జి సబ్ కలెక్టరు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, కెఆర్ సిసి డిప్యూటీ కలెక్టరు యల్.దేవకీదేవి, జిల్లా సర్వే సహాయ సంచాలకులు అన్సారీ, తదితరులు పాల్గొన్నారు.