Close

వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోండి..

Publish Date : 28/02/2025

ఏలూరు, ఫిబ్రవరి, 28: ఏపి సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి శుక్రవారం సాయంత్రం పెన్షన్లు, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్ఎంఈ సర్వే, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులు, ఫీడర్ స్థాయి సోలారైజేషన్ పథకంకు భూమి కేటాయింపు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సమీక్షించారు. వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా , నీటి ద్వారా సంభవించే వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు తీసుకుంటున్న చర్యలను కూడా ఆయన సమీక్షించారు.

ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ,జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లా అధికారులతో సమీక్షిస్తూ వేసవిలో త్రాగునీటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. ఏలూరు నగరంలో త్రాగునీటి ఎద్దడికి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో త్రాగునీటి సరఫరాపై పూర్తి వివరాలను కమీషనర్ ను ఆరా తీశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని మంచినీటి చెరువులను కాల్వలను మూసేలోగా పూర్తిస్ధాయిలో నింపుకునేలాగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటి నిల్వలు, బావుల్లో నీటి పరిస్ధితి, అద్దె ప్రాతిపధికన ప్రైవేటు బోరులు వివరాలు, త్రాగునీటి ఎద్దడి ఎదురైనప్పుడు ట్యాంకర్లద్వారా నీటిసరఫరా అంశాలపై ఆర్ డబ్య్లూఎస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. కాల్వల నుండి త్రాగునీటి అవసరాలకోసం నీరు సరఫరా చేసే సమయంలో ఎక్కడా కూడా అక్రమంగా నీటిమళ్లింపు జరుగకుండా చూడాలన్నారు. వేసవికాలంలో నీటి ద్వారా సంభవించే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో డి ఆర్ వో వి.విశ్వేశ్వర రావు,జడ్పీ సీఈవో కె.సుబ్బారావు,సీపీఓ సిహెచ్ వాసుదేవరావు, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ సత్యనారాయణ, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వర రావు, ఎపిఐఐసి జెడ్ఎం కె.బాబ్జి, డిఆర్డీఏ పిడి ఆర్.విజయరాజు, విద్యుత్ శాఖ ఏస్ఈ సాల్మన్ రాజు ,పౌర సరఫరాల శాఖ జీయం శ్రీలక్ష్మి,ఏపీఎస్ఆర్టీసీ డియం బి. వాణి, మున్సిపల్ కమీషనర్ ఎ. భానుప్రతాప్, డి ఎల్ పివో సుందరి,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.