శ్రీరామనవమి సందర్భంగా ఏలూరు రిజర్వ్ పోలీసు లైన్లో వెలసిన శ్రీ దాసాంజనేయస్వామి వారి కోవెల సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
Publish Date : 06/04/2025

ఏలూరు, ఏప్రిల్, 6: శ్రీరామనవమి సందర్భంగా ఏలూరు రిజర్వ్ పోలీసు లైన్లో వెలసిన శ్రీ దాసాంజనేయస్వామి వారి కోవెల సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఏలూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. పి .ఎస్. కిషోర్, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించారు. కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య దంపతులు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జిల్లాలోని డిఎస్పీ లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐ లు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని శ్రీ సీతారాముల కల్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామివారి తీర్ధప్రసాదాలు, పానకం లను భక్తులకు పంపిణీ చేశారు.