Close

సమాచారహక్కు చట్టం జిల్లా స్థాయి సమన్వయ కమిటీలో సభ్యులుగా ఇద్దరు కార్యకర్తల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.

Publish Date : 16/11/2025

ఏలూరు, నవంబర్, 16 : సమాచారహక్కు చట్టం జిల్లా స్థాయి సమన్వయ కమిటీలో సభ్యులుగా ఇద్దరు కార్యకర్తల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. సమాచారహక్కు చట్టం నియమ, నిబందనల పూర్తిగా తెలిసి సమాచారహక్కు చట్టం పై అవగాహన, ఆసక్తి కలిగిన వ్యక్తులు జిల్లా స్థాయి సమన్వయ కమిటీలో సంవత్సర కాలంపాటు సభ్యులుగా ఉండేందుకు తమ దరఖాస్తులను ప్రభుత్వ పనిదినములలో ఈనెల 29వ తేదీలోగా ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని మెజిస్టిరియల్ సెక్షన్ అందేలా దరఖాస్తులు పంపాలన్నారు. సదరు నిర్ణీత దరఖాస్తు కొరకు మరియు ఇతర సమాచారము https://eluru.ap.gov.in/rti/ వెబ్సైటు లో అందుబాటులో ఉంటాయని, లేదా జిల్లా కలెక్టరేట్ లోని మెజిస్టిరియల్ సెక్షన్ సంప్రతించాలని కలెక్టర్ తెలియజేసారు.