Close

సమాచార హక్కు చట్టం-2005, జిల్లా కలెక్టరేటులో 20 సంవత్సరాలు వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ..

Publish Date : 06/12/2025

ఏలూరు, డిసెంబరు 06: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో శనివారం సాయత్రం సమాచార హక్కుచట్టం- 20 సంవత్సరాలు వేడుకలు జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం- 2005 అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయ్యిందని, ఈ రోజు ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వంలో పారదర్శకత, జవాబు దారీతనాన్ని ప్రోత్సహించ డానికి, పౌరులకు సమాచార సాధికారతను అందించడానికి ఉద్దేశించిన కార్యక్రమం అని తెలిపారు. ఈ చట్టం అవినీతిని అరికట్టడానికి ఒక ముఖ్యమైన ఆయుధమని, అధికారులు సకాలంలో సమాచారం అందించడం ద్వారా ఈ వేడుకలు చట్టం యొక్క ప్రాముఖ్యతకు సార్థకత ఉంటుందని నొక్కి చెప్పారు. పనితీరులో పారదర్శకత, జవాబు దారీతనాన్ని పెంచడం, మరియు సమాచారాన్ని పొందే హక్కును పౌరులకు కల్పించడం జరిగిందని అన్నారు. ఈ చట్టం ద్వారా ఎంతోమంది ప్రయోజనం పొందుతున్నారని, ఇది సుపరిపాలనకు కీలకమని తెలిపారు. మారుమూల గ్రామాల్లో మరింత ఆర్టిఐ చట్టంపై ప్రజలకు అవగాహన, చైతన్యం పరిచే భాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. అధికార్లు నిర్ణీత సమయంలో సమాచారం యివ్వాలని, అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి సీరియస్ అవుతుందని, సమాచార హక్కుచట్టం (ఆర్ టిఐ)పై ప్రతి అధికారి అప్రమత్తంగా దృష్టి సారించాలని అన్నారు.ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పౌరసమాచార అధికారి ఉంటారన్నారని, ధరఖాస్తు దారుడు ధరఖాస్తు రుసుముగా 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. దారిద్యరేఖకు దిగువ కలిగిన వ్యక్తులు తమ రేషన్ కార్డును నకలును ధరఖాస్తుకు జతచేస్తే దరఖాస్తు రుసుము చెల్లించవలసిన అవసరం లేదన్నారు. ధరఖాస్తుదారుడు కోరిన సమాచారం అందించేందుకు ధరఖాస్తుదారుడు సమాచార రుసుము మాత్రం తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటున్నదన్నారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, ఏలూరు ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, జంగారెడ్డిగూడెం ఆర్డీవో యం.వి.రమణ, డిప్యూటీ కలెక్టరు యల్. దేవకిదేవి, సర్వే ఏడి అన్సారీ, జిల్లా కలెక్టరేటు ఏవో యన్.వి. నాంచారయ్య, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.