సర్. సి.ఆర్. రెడ్డి కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

ఏలూరు, జూన్, 20: అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్బంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం కోసం పక్కాగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఏలూరు నగరంలో సర్. సి.ఆర్. రెడ్డి డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో ఈనెల 21వ తేదీన నిర్వహించే యోగాంధ్ర జిల్లాస్ధాయి కార్యక్రమం ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన యోగాంధ్ర కార్యక్రమాన్ని 5 వేల మందితో సర్. సి.ఆర్. రెడ్డి డిగ్రీ కళాశాలలో ఉదయం 6.30 గంటల నుండి 8.00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. దీంతో పాటు ఏలూరు నగరంలోని ఇండోర్ స్టేడియం, అల్లూరి సీతారామరాజు స్టేడియంలో కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా 6 నిమిషాలపాటు శరీరంలోని వివిధ విభాగాల కదలిక అభ్యాసనాలు, మరో 25 నిమిషాలపాటు వివిధ యోగాసనాలు, అనంతరం స్టాండింగ్ ఆసనాలు నిర్వహించబడతాయన్నారు. అనంతరం ప్రాణామాయం, కపాలబాతి, తదితర ఆసనాలు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. సుమారు 9 లక్షల మందితో జిల్లా వ్యాప్తంగా వార్డు, సచివాలయాల పరిధిలో శనివారం ఉదయం యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్నిఏర్పాటు పూర్తిచేసిందన్నారు.
కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, మున్సిపల్ కమీషనరు ఎ. భానుప్రతాప్, డీఈవో వెంకట లక్ష్మమ్మ తదితరులు ఉన్నారు.