సూపర్ జీఎస్టీ … సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ కం సేల్ కార్యక్రమాలు నిర్వహించాలి -అధికారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం
ఏలూరు, అక్టోబర్, 9 : జిల్లాలో జీఎస్టీ 2. O లో భాగంగా ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ కం సేల్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సూపర్ జీఎస్టీ … సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కలెక్టరేట్ నుండి గురువారం రాత్రి అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ 2. O లో నిత్యావసర వస్తువులతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా భారీగా తగ్గాయన్నారు. జీఎస్టీ ఫలాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు గాను జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలలో శుక్రవారం ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ కం సేల్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆ ప్రాంత ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రధాన కూడలి ప్రదేశాలలో కార్యక్రమాలు నిర్వహించాలని, జీఎస్టీ 2.O ద్వారా ఏ వస్తువులపై ఏ మేర జీఎస్టీ తగ్గిందో వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ఆ ప్రాంతంలోని ప్రజలకు అందించాలన్నారు. నిర్వహించిన కార్యక్రమాలకు సంబందించిన వివరాలు ఫొటోలతో సహా జీఎస్టీ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలన్నారు.
జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు, పురపాలక సంఘాల కమిషనర్లు, ఎంపిడిఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.