స్టాక్ పాయింట్ల నిర్వహణపై అధికారులకు దిశా, నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..
ఏలూరు,ఏప్రిల్,24: జిల్లా అవసరాలకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గ పరిధిలో ఇసుక స్టాక్ పాయింట్లు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. గురువారం సాయంత్రం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లాస్ధాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో నిర్మాణ పనులకు అనుకూలత, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇసుక స్టాక్ పాయింట్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. సుమారు నాలుగు ఎకరాల స్ధలాన్ని ఇసుక స్టాక్ పాయింట్ కోసం ఎంపిక చేయవల్సి ఉంటుందన్నారు. ఏలూరు జిల్లాకు తూర్పు గోదావరి జిల్లాలోని తాడిపూడి రీచ్ ను కేటాయించినందున అక్కడ నుండి నియోజకవర్గ ఇసుక స్టాక్ పాయింట్లకు వాహనాలను కేటాయించేందుకు ఏర్పాట్లు చేయాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. ఇసుక డిమాండ్, రుతుపవనాలు సమీపిస్తున్న కారణంగా ఇసుక కొరత నివారించేందుకు చేబ్రోలు స్టాక్ యార్డ్ ను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తూర్పుగోదావరి జిల్లాను చేబ్రోలు స్టాక్ యార్డ్ లో నిల్వచేయడానికి ఇసుక కొనుగోలు చేసేందుకు స్టాక్ పాయింట్ కు ఇసుక సరఫరా చేసేందుకు 20 నుండి 30 జీపిఎస్ అనుసంధానం కలిగిన వాహనాలను కేటాయించాలని, ఈ విషయంపై తక్షణమే సంబంధిత యజమానులతో సమావేశం నిర్వహించి ఎంపిక చేసిన జాబితాను గనులశాఖ డిడికి అందజేయాలన్నారు. రవాణా శాఖ అదికాలులు అమోదించిన వాహనాలను మాత్రమే స్టాక్ యార్డ్ ఇసుక రవాణాకు అనుమతించాలన్నారు. రానున్న మూడు నుంచి నాలుగు నెలల కాలంలో ఇసుక సరఫరాకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో స్టాక్ యార్డ్ ఏర్పాటుకు యండిఎల్ లైసెన్సుల జారీకోసం వివిధ ఏజెన్సీలను నుండి ధరఖాస్తులు కోరేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు తెలిపారు. ఇసుకడిపోలో మెట్రిక్ టన్నుకు అమ్మకం ధరకోసం రేట్లు నిర్ధేశించబడతాయన్నారు. టెండర్ ధరఖాస్తులు డిడి మైన్స్ కార్యాలయంలో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. స్టాక్ పాయింట్లలో సిసి కెమేరాలు ఏర్పాటుతోపాటు ఇతర నియమనిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాకు తావులేదని కలెక్టర్ స్పష్టం చేస్తూ రాత్రిపూట ఇసుక రవాణా కార్యకలాపాలు నిర్వహించరాదని ఆదేశించారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు స్టాక్ పాయింట్ కు తహశీల్దారు కస్టోడియన్ గా వ్యవహరిస్తారన్నారు. గూటాలలోని రెండు డీసిల్టింగ్ పాయింట్లను జంగారెడ్డిగూడెం ఆర్డిఓ, చేబ్రోలు స్టాక్ పాయింట్ ను ఏలూరు ఆర్డిఓ పర్యవేక్షించాలన్నారు. అదే విధంగా కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలకు సంబంధించి స్టాక్ పాయింట్లకు ఇసుక సరఫరాకు సమీప కృష్ణాజిల్లా పరిధిలోని ఇసుక రీచ్ లను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, గనుల శాఖ డిడి రవికుమార్, ఆర్టిఓ కృష్ణారావు, కాలుష్యనియంత్రణ మండలి అధికారులతోపాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణరాజ్, జంగారెడ్డిగూడెం ఆర్డిఓ ఎంవి రమణ, డిపివో కె. అనురాధ, జంగారెడ్డిగూడెం ఆర్టివో మదానీ,