స్టూడెంట్ ఎన్రోల్మెంట్ నూరు శాతం పూర్తి చేసేందుకు విస్తృత అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

ఏలూరు, జూలై, 03: జిల్లాలో 6 నుండి 14 ఏళ్లలోపు పిల్లలందరూ విధిగా పాఠశాలలకు వెళ్లేటట్లు చూడాల్సిన బాధ్యత తల్లితండ్రుల తోపాటు ఉపాధ్యాయులు,
అధికారులపై కూడా ఉందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు.
గురువారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో నేను బడికి పోతా కార్యక్రమం అమలుపై జిల్లాస్ధాయి అవగాహన పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డ్రాపవుట్స్ ను పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమంలో భాగంగా సర్వశిక్షా ఆధ్వర్యంలో ప్రచురించిన నేను బడికి పోతా అవగాహన కార్యక్రమం గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో స్టూడెంట్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం నూరు శాతం పూర్తి చేయడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు.
బడిఈడు పిల్లలు, బడిమానివేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించేందుకు గ్రామ, మండల, డివిజన్ స్దాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంబంధిత కమిటీలోని వివిధ శాఖల అధికారులు తమ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుని రానున్న 15 రోజులపాటు నిర్వహించే నేను బడికి పోతా అవగాహన కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలన్నారు. తక్షణమే రెండు రోజులపాటు అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో విద్యా ప్రాముఖ్యతను, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సదుపాయాలను తల్లిదండ్రులకు తెలియజేసి వారి పిల్లలను బడిలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది పిల్లల నమోదు, ఈఏడాది నమోదు మద్య వ్యత్యాసాలను గుర్తించి అందుకు అనుగుణంగా డ్రాపవుట్స్ ను బడిలో చేర్చాలన్నారు. రానున్న 15 రోజులు క్షేత్రస్దాయిలో డోర్ టు డోర్ నేను బడికి పోతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. అదే విధంగా ఏ ప్రాంతంలో ఎక్కువమంది పిల్లలు హాజరు కావడంలేదో గుర్తించేందుకు ఆ ప్రాంతంలో పర్యటించి ఎన్రోల్మెంట్ అయ్యేందుకు కృషిచేయాలన్నారు. డ్రాపవుట్స్ లో మొదటి 10 మండలాలను గుర్తించి అక్కడ వాటిని ఆయా జిల్లా అధికారులు దత్తత తీసుకొని డ్రాపవుట్స్ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్దాయిలో పర్యటించినపుడే లక్ష్యాలు సాధించగలమని కలెక్టర్ ఈ సందర్బంగా స్పష్టం చేశారు. బడిఈడు పిల్లలు విధిగా పాఠశాలల్లో ఉండాలనే లక్ష్యంగా అందరూ కలిసి సమిష్టిగా కృషిచేయాలన్నారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అనుబంధ శాఖల అధికారులను బాగస్వాములను చేసి నూరుశాతం లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. ముఖ్యంగా విద్యా, వైద్య, ఐసిడిఎస్, కార్మిక, రెవిన్యూ, సంక్షేమ శాఖలు సమన్వయంతో జిల్లాను డ్రాపవుట్స్ రహిత జిల్లాగా ఉంచేందుకు కృషిచేయాలన్నారు. బడిఈడు పిల్లలందరినీ బడిలో చేర్చి బడిబయట పిల్లలు లేని సచివాలయం పరిదిగా, గ్రామంగా, మండలంగా, డివిజన్ గా సంబంధిత అధికారులు తీర్మానం చేసి సమర్పించాలన్నారు. జిల్లాలోని సాంఘీక సంక్షేమ, బి.సి., మైనారిటీ, ఐటిడిఏ పరిదిలోని అన్ని సంక్షేమ హాస్టల్స్ లోవిద్యార్ధుల నమోదు నూరుశాతం ఉండేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. డ్రాపవుట్స్ కు సంబంధించి సమాచారం ఇచ్చేందుకు 9533399981 నెంబరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను బడికి పోతా కార్యక్రమం కింద డ్రాపవుట్స్ రహిత జిల్లాగా ఉంచేందుకు జిల్లాస్ధాయిలో కమిటీతోపాటు డివిజన్ స్దాయిలో ఆర్డిఓ చైర్మన్ గా, డిప్యూటీ డిఇఓ కన్వీనర్, డిల్ డిఓ, సిడిపివోలు సభ్యులుగా ఉంటారు. అదే విధంగా మండల స్ధాయిలో యంపిడివో చైర్మన్ గా ఎంఇఓ కన్వీనర్ గా తహశీల్దారు, అంగన్వాడీ సూపర్ వైజర్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్, పంచాయితీ కార్యదర్శి, క్లస్టర్ రిసోర్స్ పర్సన్, ఎస్ హెచ్ జి మెంబర్, పేరెంట్స్ సభ్యులుగా ఉంటారు. గ్రామ, వార్డు స్ధాయి ఎన్రోల్మెంట్ కమిటీలో వెల్పేర్ మరియు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కన్వీనర్ గా అంగన్వాడీ కార్యకర్త, ఆశా, ఎఎన్ఎం, విఆర్ఓ, స్కూల్ హెడ్ మాస్టార్లు సభ్యులుగా ఉంటారు. ఈ ఎన్రోల్మెంట్ కమిటీలు నూరుశాతం ఎన్రోల్మెంట్ కు, జీరో డ్రాపవుట్స్, డోర్ టు డోర్ అవగాహన కార్యక్రమాల నిర్వహణకు బాధ్యత వహిస్తాయి.
సమావేశంలో డిఆర్ఓ
వి.విశ్వేశ్వరరావు, డిఇఓ యం. వెంకటలక్ష్మమ్మ , సమగ్రశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ పంకజ్ కుమార్, సిపివో వాసుదేవరావు, డిఎంహెచ్ఓ ఆర్. మాలిని, సోషల్ వెల్పేర్ జెడి వై. విశ్వమోహన…