స్ట్రాంగ్ రూంలలో బ్యాలెట్ బాక్సులు భద్రం
ఏలూరు, ఫిబ్రవరి, 28 : ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, కాకినాడ జిల్లాల నుండి ఎన్నికల పోలింగ్ అనంతరం ఏలూరు సర్. సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో భారీ భద్రతల నడుమ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. అనంతరం అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లకు అధికారులు వేశారు. స్ట్రాంగ్ రూమ్ లలో సిసి కెమెరాల పర్యవేక్షణ, మూడంచెల భద్రతా అంశాలను ఎన్నికల పరిశీలకులు సిహెచ్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, డిఆర్ ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ భానుప్రతాప్ , ఏలూరు తహసిల్దార్ శేషగిరిరావు, ప్రభృతులు పాల్గొన్నారు.