‘స్వచ్ఛత ఏలూరు – సుందర ఏలూరు’ ప్రత్యేక పారిశుద్ద్య డ్రైవ్-జాయింట్ కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డా.ఎం.జె. అభిషేక్ గౌడ
ఏలూరు, సెప్టెంబర్, 9 : ఏలూరు నగరాన్ని పరిపూర్ణ పరిశుభ్రతతో సుందరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో నెలరోజులపాటు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం ఈనెల 9వ తేదీ నుండి నెలరోజుల పాటు నిర్వహించాలన్నారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా
ప్రధాన రోడ్లు, వీధుల్లో చెత్తను పూర్తిస్థాయిలో తొలగించడం, రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తీసివేసి మార్జిన్లు స్పష్టంగా కనబడేలా చేయడం. వర్షపు నీరు నిలవకుండా మట్టి దిబ్బలను తొలగించడం వంటి చేయాలనీ, చెత్త పేరుకుపోయే ప్రాంతాలను (Garbage Vulnerable Points) గుర్తించి, వ్యర్థాలను వెంటనే కంపోస్ట్ యార్డుకు తరలించడం. ప్రజలు పదేపదే చెత్త వేసే ప్రదేశాలను శుభ్రం చేసి, అక్కడ మొక్కలు నాటి సుందరీకరించాలన్నారు. మురుగునీరు నిలవకుండా కాలువలలో పూడికను తీయడం, తీసిన సిల్ట్‌ను వెంటనే వాహనాల ద్వారా కంపోస్ట్ ప్లాంట్‌కు తరలించాలన్నారు. అన్ని డివిజన్ల శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలు ప్రతిరోజూ తమ పరిధిలోని పనులకు సంబంధించి పనులకు ముందు – పనుల తర్వాత (Before & After) తీసిన ఫొటోలను, తొలగించిన వ్యర్థాల పరిమాణం వివరాలను రోజూ వాట్సాప్ గ్రూపుల్లో నివేదించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, మన ఏలూరును పరిశుభ్రంగా ఉంచుకోవడంలో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలని అభిషేక్ గౌడ విజ్ఞప్తి చేశారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ప్రత్యేక అధికారి ఆదేశాలననుసరించి ఏలూరు నగరంలో ఈనెల 9వ తేదీ నుండి నెల రోజులపాటు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్ తెలియజేసారు.