Close

స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత ఇతివృత్తంగా స్వచ్ఛతాహీ సేవా-2024 ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చేపట్టి పరిశుభ్రత మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు అన్నారు.

Publish Date : 16/11/2024

ఏలూరు, నవంబర్, 16: స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత ఇతివృత్తంగా స్వచ్ఛతాహీ సేవా-2024 ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చేపట్టి పరిశుభ్రత మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆవరణంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని కలెక్టరేట్ సిబ్బందితో చేపట్టారు. ఈ సందర్బంగా డిఆర్ఓ మాట్లాడుతూ మన ఇంటి పరిశుభ్రతలే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా పరిశుభ్రతతో నిండివుండాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈ రోజు స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ సందర్బంగా ఆవరణలో ఉన్న అల్లూరి సీతారామరాజును స్మరించుకుంటూ వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్, కలెక్టరేట్ కార్యాలయ ఏవో నాంచారయ్య, పరిపాలనావిబాగం సూపరింటెండెంట్లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.