Close

హౌస్ హోల్డ్ సర్వే వేగవంతం చెయ్యాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 18/11/2024

ఏలూరు, నవంబరు, 18: అపార్ నమోదు ప్రక్రియ వేగవంతంగా చేసి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలం నంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో అపార్ నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, అపార్ నమోదు ప్రక్రియను మండలాల వారీగా సమీక్షించారు. కొన్ని మండలాల్లో అపార్ నమోదు ప్రక్రియ వెనుకబడి ఉండటంపై దానికి సంబంధించిన సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఆధార్ నమోదు కేంద్రాలు 45 ఉన్నాయని, ఏ మండలంలో నమోదు ప్రక్రియ వెనుకబడివుందో ఆ మండలానికి మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని జెడ్పి సిఇఓ కె. సుబ్బారావును ఆదేశించారు. ఇచ్చిన టార్గెట్ ప్రకారం రెండు, మూడు రోజుల్లో అపార్ నమోదును పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని మండలాల్లో పుట్టిన తేది, పేరు తదితర వివరాలు తప్పుగా నమోదుకావడం వల్ల వాటిని సరిచేసి ఆధార్ ను అనుసంధానం చేయాలని ఆదేశించారు.
పల్లె పండుగ కార్యక్రమం ద్వారా జిల్లాలో 983 సిసి రోడ్లు నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందని కొన్ని మండలాల్లో సిసి రోడ్ల నిర్మాణం వెనుకబడివుండటానికి గల కారణాలను జిల్లా కలెక్టర్ యంపిడివోలను, పంచాయితీ ఏఇ లను ఆరా తీశారు. మండలాల వారీగా ఇచ్చిన సిసి రోడ్ల నిర్మాణానికి ఇచ్చిన టార్గెట్ ను పూర్తిస్ధాయిలో పూర్తిచేసి డిశంబరు 31 కల్లా పనులు పూర్తయ్యేలాగ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ మండలంలోనైనా వెండర్స్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతి కనబర్చకపోతే వారిని తొలగించడం జరుగుతుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ గా సిసిరోడ్ల నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీలు మండలాల వారీగా నిర్వహిస్తానని తెలిపారు. జెడ్పి సిఇఓ, యంపిడివోలు సిసి రోడ్ల నిర్మాణ పనులను క్షేత్రస్ధాయిలో తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. వారానికి టార్గెట్ ప్రకారం రోడ్డు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానని కలెక్టర్ వెల్లడించారు.
ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మరి ముఖ్యంగా ఇసుక ఉచితంగా తీసుకోవడానికే తప్పా అమ్ముకోవడానికి కాదని ఈ విషయాన్ని గ్రహించి సంబంధిత మండల యంపిడివో ఇసుక అవసరం ఉన్న వారికి పర్మిషన్ పత్రాన్ని జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కుక్కునూరు, కొవ్వూరులో అందుబాటులో ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయని అవసరమైన వారు ప్రక్క జిల్లా నుంచి కూడా నిబంధనల మేరకు ఇసుకను ఉచితంగా పొందవచ్చని తెలిపారు.
జిల్లాలో చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వేపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి యంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లతో సమీక్ష నిర్వహించారు. వలసలు, డెత్ లు, ఫోన్ నెంబరు సమస్యలపై కలెక్టర్ ఆరా తీశారు. వార్డు సచివాలయంలోని సిబ్బందిని వినియోగించుకొని హౌస్ హోల్డ్ సర్వే త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.
సమావేశంలో జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డ్వామా పిడి కె. వెంకట సుబ్బారావు, డిఇఓ వెంకటలక్ష్మమ్మ, డివిఇవో బి. ప్రభాకరరావు, ఆర్ఐ కె. చంద్రశేఖరబాబు, యంఇవోలు, యంపిడివోలు, పంచాయితీరాజ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.