Close

500 మంది పిల్లలకు రూ 75 లక్షలతో 852 మందికి వివిధ ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేసిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి

Publish Date : 03/04/2025

ఏలూరు:ఏప్రియల్ ,3 : గురువారం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా విద్యశాఖ మరియు సమగ్రశిక్ష ఏలూరు జిల్లా ఆధ్యర్యంలో ప్రత్యేక అవసరాలు గల 500 మంది పిల్లలకు రూ 75 లక్షల విలువ చేసే వివిధరకాలు
ఉపకరణాలను ఉచితంగా జిల్లా కె.వెట్రిసెల్వి, స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య సంయుక్తంగా పాల్గొని పంపిణీ చేసి,పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల 500 మంది విద్యార్థిని,విద్యార్థులకు రూ 75 లక్షల విలువ చేసే ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశామని, ఇప్పటి వరకు 852 మంది పిల్లలకు ఉపకరణాలు పంపిణీ చేసి, రాష్ట్రంలోనే మన ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. . భవిత కేంద్రాలలో ఫిజియోథెరపీ,వైద్య సేవలు, విద్యాబుద్ధులు నేర్పించే బాధ్యత ప్రత్యేక ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు.

శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఎత్తున ఏలూరు జిల్లాలో ఉపకరణాలు పంపిణీ చేయడం జిల్లా కలెక్టరు వెట్రిసెల్వి, సంబంధిత అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థిని, విద్యార్థులకు అన్ని విధాలుగా సాయం అందించుటకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు సమాజంలో అందరితో సమానంగా ఎదిగేలా ఉపాధ్యాయుల కృషి చేయాలని, ప్రభుత్వపరంగా కావలసిన సదుపాయాలన్ని కల్పిస్తామని అన్నారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనటం ఒక మహా పుణ్య కార్యక్రమముగా భావిస్తున్నానని బడేటి రాధాకృష్ణయ్య అన్నారు.

ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో – ఆర్డినేటరు పి.పంకజ్ కుమార్, ఐఇ కో -ఆర్డినేటరు బి.భాస్కర రాజు,అలింకో కంపెనీ ప్రతినిధులు,నగరపాలక కో- ఆప్షన్ సభ్యులు పెదబాబు, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థిని,విద్యార్థులు వారి తల్లితండ్రులు,తదితరులు పాల్గొన్నారు.