Close

ఆరోగ్యశ్రీ లో అధనంగా డబ్బులు వసూలు చేస్తే ఆయా ఆసుపత్రులపై చర్యలు

Publish Date : 10/07/2024

ఏలూరు, జూలై, 10…ఆరోగ్యశ్రీ లో అధనంగా డబ్బులు వసూలు చేస్తే ఆయా ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏలూరు జిల్లా సమన్వయకర్త డా. ఐ. రాజీవ్ తెలిపారు. జిల్లాలో ఆరోగ్యక్షీ వర్తింపు కలిగిన 31 ప్రవేట్ ఆసుపత్రుల్లో రోగులకు అందుబాటులో ఆరోగ్యమిత్రాలు ఉన్నారన్నారు. ఓపి లో అవుట్ పెషెంట్ విభాగంలో టెస్టులు ఉచితంగానే చేయిస్తారని ఎటువంటి రుసుము చెల్లించనక్కరలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఓపిలో ఖర్చుపెట్టుకున్న సొమ్ము ఆరోగ్యశ్రీలో ఐపి ఐతే ఖర్చుపెట్టిన సొమ్మును కూడా ఇప్పంచడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీలో ఉన్న ప్రతిఒక్క రోగికి అధనంగా డబ్బులు వసూలు చేయడం జరగదని ఒకవేళ అటువంటి చర్యలకు పాల్పడితే ఆరోగ్యమిత్ర వారు రోజూ ఆన్ బెడ్ కు వెళ్లినపుడు రోగి మాదగ్గర అధనంగా డబ్బులు వసూలు చేశారని వ్రాతపూర్వకంగా తెలియజేస్తే వెంటనే వాళ్లు ఖర్చుపెట్టిన సొమ్ము తిరిగి ఇప్పించడంతోపాటు సంబంధిత ఆసుపత్రులపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులేనివారికి కూడా ముఖ్యమంత్రి క్యాంపుకార్యాలయం లేఖద్వారా కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం అందుతుందన్నారు. ఎన్నికల కోడ్ సమయంలో ఆరోగ్యశ్రీ కార్డులేని వారు డబ్బులు కట్టి వైద్యం చేయించుకున్నవారికి అప్పుడు కొన్ని జబ్బులకు మాత్రమే సిఎంఓ ద్వారా లేఖ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ సమయంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి మాత్రం వైద్యం ఉచితంగానే అందిందని, లేనివారు సొమ్ముకట్టి వైద్యం చేయించుకున్నారన్నారు.