తిరంగా కాన్వాస్ పై సంతకం చేసి జాతీయ జెండాతో సెల్ఫీ ఫొటో తీసుకున్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు, ఆగష్టు, 13 :ఆజాధిక అమృత్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మంగళవారం స్ధానిక ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన తిరంగా కాన్వాస్ పై సంతకం చేసి జాతీయ జెండాతో సెల్పీ ఫొటో తీసుకున్నారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వాడ వాడలా జెండా పండుగ నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఆగస్టు, 13 నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి సెల్పీ తీసుకొని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి, డిఎస్ డివో బి. శ్రీనివాస్, డిఇఓ అబ్రహాం, సెట్ వెల్ సిఇఓ మధుభూషణరావు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యం.ముక్కంటి,పలువురు పోలీసు,ఎక్సైజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
