ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో త్వరితగతిన సత్వర న్యాయం అందించడంలో సమస్యపై కూలంకుషంగా చర్చించి పరిష్కరించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు.
ఏలూరు, ఆగస్టు, 13 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో త్వరితగతిన సత్వర న్యాయం అందించడంలో సమస్యపై కూలంకుషంగా చర్చించి పరిష్కరించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం సాయంత్రం ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో చార్జిషీట్ ను త్వరితగతిన ముగించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఛార్జీషీట్ ను జాప్యం లేకుండా నిర్దేశిత సమయంలో దాఖలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, అప్పుడే బాధితులకు సత్వరం న్యాయం చేకూరుతుందని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఆశయం నెరవేరుతుందన్నారు. కేసుల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని, విచారణ, తదితర అంశాలలో ఎక్కడైనా జాప్యం జరిగితే వేంటనే అధికారులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలో ప్రస్తుత జనవరి నుండి జూలై 31వ వరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద 67 కేసులు నమోదయ్యాయని, వీటిలో హత్యకు సంబంధించి 1, రేప్ కు సంబంధించి 9, ఇతర కేసులు 57 నమోదయ్యాయన్నారు. , వీటిలో 62 కేసులకు సంబంధించి బాధితులకు ఎఫ్.ఐ.ఆర్. స్థాయిలో 46 లక్షల 25 వేల రూపాయలు, చార్జిషీట్ స్థాయిలో 15 మంది బాధితులకు 11 లక్షల 50 వేల రూపాయలు అందించడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని మండలాలలో సివిల్ రైట్స్ డే ని నిర్వహించాలని, మండల కమిటీ సభ్యులను సివిల్ రైట్స్ డే భాగస్వాములను చేయాలనీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు న్యాయం చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చి కేసులకు సంబంధించి త్వరితగతిన ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నామని, . కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేసులకు సంబందించిన ఎఫ్. ఐ. ఆర్. సమాచారాన్ని ఆన్లైన్ లో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు.
సమావేశంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డి ఆర్ ఓ డి. పుష్పమణి, ఆర్డిఓలు ఎన్ఎస్ కె ఖాజావలి, కె. అద్దయ్య, వై. భవానీశంకరి, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జయ ప్రకాష్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వరప్రసాద్, డిఎస్పీ లు, కమిటీ సభ్యులు జి. మోహనరావు, బాణావతు రాజు, మట్టా రాజు, తోకల రాజేష్ బాబు, జి. రవికుమార్, ప్రభృతులు, పాల్గొన్నారు.