Close

ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు ఓటర్ల ఫారం-19 సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబరు, 3వ తేదీ. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

Publish Date : 20/08/2024

ఏలూరు, ఆగస్టు, 20…రాష్ట్ర శాసన మండలి తూర్పు, పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఉపాధ్యాయ ఓటర్ల నవీకృత జాబితా రూపకల్పనకు ఎన్నికల కమీషన్ జారీచేసిన షెడ్యూల్ ప్రకారం చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

మంగళవారం స్ధానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో యంఇఓలు, యంపిడివోలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఉపాధ్యాయ ఓటర్ల నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2024 నవంబరు, 1 క్వాలిపైయింగ్ తేదీగా ఓటరు జాబితా నవీకరణపై గత నెల 29న నోటిఫికేషన్ కు సంబంధించి పబ్లిక్ నోటీసు జారీచేశారన్నారు. ఈ నేపద్యంలో తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియపై అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నూతన ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు ఓటర్ల ఫారం-19 సమర్పించడానికి సెప్టెంబరు, 3వ తేదీ అని, ఓటర్ల జాబితాపై క్లైయిమ్స్ అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు, 15 వరకు అవకాశం ఉందన్నారు. అభ్యంతరాలను అక్టోబరు, 30వ తేదీ నాటికి పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను నవంబరు, 6వ తేదీన ప్రచురిస్తారని పేర్కొన్నారు. ధరఖాస్తులను యంఇవోల ద్వారా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, ఐటిఐ, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలకు పంపడం జరుగుతుందన్నారు. ఎన్నికల కమీషన్ నిర్ధేశించిన మేరకు ధరఖాస్తును స్వీకరించాలన్నారు.

సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహాం, డివిఇఓ ప్రభాకరరావు, ఆర్ఐఓ కె. చంద్రశేఖర్, పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, యంఇఓలు, యంపిడివోలు పాల్గొన్నారు.