ఈ రోజు అంత అప్రపత్తంగా వుండాలి..

బుధవారం రాత్రి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి
గత వారం రోజులుగా వర్షాలు మూలంగా కాలువలు చెరువుగట్లు నాని ఉండటం వల్ల గండ్లు పడే అవకాశం ఉంటుందని, ఇటువంటి వాటిని గుర్తించేందుకు ప్రతి చెరువుకు ఒకరిని పర్యవేక్షణ అధికారిగా నియమించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎక్కడైనా అటువంటి గుర్తిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి అన్నారు. రానున్న రెండు,మూడు రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
శిధిలావస్థలో ఉన్న భవనాలు కూలి ప్రాణం నష్టం జరిగిందని మాట రాకుండా మరోమారు అటువంటి భవనాలను గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు
వీఆర్వోలు అందరూ గ్రామాల్లోనే ఉండాలని ఆదేశించారు
పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలని, బ్లీచింగ్ వేసే కార్యక్రమం స్పష్టంగా కనబడాలన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ పంచాయతీరాజ్ పనితీరు ప్రస్తుత ఎంతో కీలకమన్నారు
వైద్య శిబిరాల తో పాటు హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే చురుకుగా సాగాలన్నారు.
ఈ విషయంలో ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఐసిడిఎస్ సిబ్బంది బాగా పని చేయాలన్నారు
తాము క్షేత్రస్థాయి పర్యటనలో హౌస్ టు హౌస్ సర్వేపై ఆరా తీస్తామని చెప్పారు.
తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, లీకేజీలను గుర్తిస్తే వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
క్లోరినేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.