Close

చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్, పాన్ ఇండియా ఆర్గనైజేషన్ వరద బాధితులకు వితరణ.

Publish Date : 06/09/2024

ఏలూరు, సెప్టెంబరు, 6… చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్, పాన్ ఇండియా ఆర్గనైజేషన్ విశాఖపట్నం వారు, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వరద బాధితుల సహాయార్ధం 500 దుప్పట్లు, 300 బెడ్‌షీట్‌లు మరియు 500 బేబీ స్లీపింగ్ ప్యాక్‌లు మరియు 6000 శానిటరీ న్యాప్కిన్ లను శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ లో కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ లకు అందజేశారు. కార్యక్రమంలో హౌసింగ్ పిడి శ్రీనివాస్, ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి, చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ రీజనల్ మేనేజరు ఎన్. సుబ్బలక్ష్మి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు