Close

జిల్లాలో ఇంతవరకు ఖరీఫ్ పంట 94.4 శాతం ఈ-క్రాప్ నమోదు…

Publish Date : 10/09/2024

ఏలూరు, సెప్టెంబరు, 10… జిల్లాలో ఖరీఫ్ పంటకు సంబంధించి ఇప్పటివరకు 4,62,711 ఎకరాలు సాగు చేయగా 4,36,945 ఎకరాలు (94.4%) పంట నమోదు జరిగిందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్ కె హబీబ్ బాషా తెలిపారు. ఖరీఫ్ వరి పంటకు సంబంధించి జిల్లాలో 1,83,489 ఎకరాలు సాగు చేయగా ఇప్పటి వరకు 1,70,032 ఎకరాలు (92.7%) ఈ-క్రాప్ నందు నమోదు జరిగిందన్నారు. మిగిలిన పంట నమోదు ప్రభుత్వం నిర్ధారించిన గడువులోపు పూర్తి చేస్తాం అన్నారు. ఎక్కడైనా పంట నమోదు చేసే ప్రక్రియలో తలెత్తిన సమస్యలను ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలియజేసి పరిష్కరిస్తున్నమన్నారు. ఖరీఫ్ సంబంధించి వరి, ప్రత్తి, అపరాలు , ఇతర పంటల సాగును ఈ పంటలో పంట-నమోదు చేస్తున్నమన్నారు.