శభాష్ ఏలూరు జిల్లా యంత్రాంగం – జిల్లాను ఉత్తేజంగా పరిగెత్తిస్తున్న యువ అధికారులు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్.
ఏలూరు, సెప్టెంబరు, 11: శభాష్ ఏలూరు జిల్లా యంత్రాంగం – జిల్లాను ఉత్తేజంగా పరిగెత్తిస్తున్న యువ అధికారులు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్.
ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందనలు..
వాస్తవానికి ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా జిల్లా లోని ప్రతి ఒక్క అధికారి సిబ్బంది ఈ వరదల్లో విశేష కృషి చేశారని చెప్పవచ్చు. కొల్లేరులో ఔట్ ఫాల్ డ్రయిన్ అయిన ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద నీరు వెళ్ళటానికి అవకాసం లేదని తెలిసిన మరుక్షణమే జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ యుద్ధప్రాతిపదికన ఆపరేషన్ ఉప్పుటేరు ప్రారంభించారు. వరదల్లో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా శ్రమించారు. నూజివీడు పెద్ద చెరువు గండి పడినప్పుడు ఎస్పీ చూపిన చొరవ నిజంగా అభినందనీయం. ఒకవేళ అదే కనుక జరగకపోయి ఉంటే, బయటకు పోయే దారి లేక వరద నీరు కొల్లేటి లంక గ్రామాలను మరింతగా ముంచేది. మరోవైపు సహాయక శిబిరాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడటంలో సఫలం అయ్యారు. ఆఖరికి మంగళవారం రాత్రి వరకు ముఖ్యమంత్రి వేరే జిల్లాకు వెళ్తున్నారని షెడ్యూల్ వచ్చింది. కానీ బుధవారం తెల్లవారుజామున ముఖ్యమంత్రి పర్యటన ఆకస్మికంగా ఏలూరుకు మారింది, వెంటనే జిల్లా యంత్రాంగం మొత్తం అలెర్ట్ అయ్యి ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.