Close

విరాళాల వెల్లువ.

Publish Date : 11/09/2024

ఏలూరు, సెప్టెంబర్, 11 : ఏలూరు జిల్లాలో వరద నష్టాలను పరిశీలించడానికి బుధవారం జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు జిల్లాలోని ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయనిధికి, రాజధాని నిర్మాణానికి విరాళాలు అందజేశారు.
సర్. సి.ఆర్.రెడ్డి కళాశాల సంస్థల సిబ్బంది వరద సహాయక కార్యక్రమాలకు తమ ఒకరోజు వేతనం రూ. 20 లక్షల విరాళాన్ని బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి సంస్థల చైర్మన్ అల్లూరి ఇంద్రకుమార్ అందజేశారు. వరద సహాయక చర్యలకు ఏలూరు క్లబ్ 10 లక్షల 116 రూపాయల చెక్కును ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ముఖ్యమంత్రి కి అందజేశారు.
రాజధాని అమరావతి నిర్మాణానికిగాను చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ 4 లక్షల రూపాయల విరాళాల చెక్కును, దెందులూరు మండలంలోని కొవ్వలి గ్రామ మహిళల బృందం సేకరించిన 5 లక్షల రూపాయలు కలిగిన డిబ్బీని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు అందజేశారు.