Close

వరద బాధితులకు మానవతా చేయూతను అభినంధించిన జిల్లా కలెక్టర్…

Publish Date : 13/09/2024

ఏలూరు, సెప్టెంబరు, 13:వరద బాధితులను ఆదుకునేందుకు మానవతా ధృక్పధంతో చేయూత నందిస్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా స్వచ్ఛంద సేవా సంస్ధను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అభినందించారు.

స్ధానిక కలెక్టరేట్ లో శుక్రవారం ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వికి జిల్లా మానవతా స్వచ్ఛంద సేవా సంస్ధ ప్రతినిధులు వరద బాధితుల సహాయార్థం లక్ష రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.

కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా స్వచ్ఛంద సేవా సంస్ధ జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కరరావు, కార్యదర్శి పి. దేవరత్నాకరరావు, ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ కడియాల కృష్ణారావు, డెవలప్ మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజేయ్ బాబు, ఏలూరు విభాగం చైర్మన్ అడుసుమిల్లి నిర్మల, డైరెక్టర్ యం. కుమార్, కోశాధికారి అల్లూరి మోహిని, సంయుక్త కార్యదర్శి పైడి కస్తూరిబాయి, పూర్వ కార్యనిర్వాహక సభ్యులు మానేపల్లి రామారావు ఉన్నారు.