ఈనెల 17వ తేదీన నులిపురుగుల నిర్మూలన నివారణ దినోత్సవం.
ఏలూరు, సెప్టెంబరు,13:జిల్లాలో ఈనెల 17వ తేదీన నులిపురుగుల నిర్మూలన నివారణ దినోత్సవంగా నిర్వహించనున్నామని ఈ కార్యక్రమంలో అన్ని అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాల సిబ్బంది చురుకుగా పాల్గొనాని కార్యక్రమాన్ని నూరు శాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.
శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ లో నులిపురుగుల నివారణ , ఆల్బెండ్జోల్ మాత్రలు అవశ్యకత కు సంబంధించి ప్రచార వీడియోలు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్ల లోపువారికి నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. పేగుల్లో నులిపురుగుల వల్ల పిల్లల ఎదుగుదల మందగించడం, నీరసం, రక్తహీనత, చదువులో ఏకాగ్రత కోల్పోవడం వంటి రుగ్మతలతో బాధపడుతన్నారని వీటని నివారించేందుకు ప్రభుత్వం నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తుందన్నారు. నులిపురగుల నివారణ దినోత్సవం రోజైన ఈనెల 17వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, విద్యాసంస్ధలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఏడాది నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ మాత్రలు పంపిణీ చేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ 17 వ తేదీన ఎవరైనా మాత్రలు వేసుకోకపోతే సెప్టెంబర్ 25వ తేదిన వారు మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎస్. శర్మిష్ట, జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి డా:పౌల్ సతీష్ కుమార్ ,ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె. పద్మావతి, ఆర్ బిఎస్ కె జిల్లా ప్రోగ్రాం అధికారి డా కె. నరేంద్ర కృష్ణ, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నరేష్ బొప్పన, తదితరులు పాల్గొన్నారు.