స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత లో ప్రజలు భాగస్వాములు కావాలి పరిసరాల పరిశుభ్రత అందరి భాద్యత స్వచ్ఛతా హి సేవా మానవహారంలో జిల్లా కలెక్టర్, శాసన సభ్యులు, నగర మేయర్ వెల్లడి…
ఏలూరు జిల్లా అంతట పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో సమీష్టి కార్యాచరణ, పౌరుల్లోభాగస్వామ్య స్పూర్తిని పునరుద్ధరించడమే ధ్యేయంగా జిల్లా వాసులు ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం స్ధానిక పాత బస్టాండ్ అంభేద్కర్ విగ్రహం సెంటరు వద్ద నేటి నుండి అక్టోబరు 2వ తేదీ వరకు జిల్లాలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హి సేవా పక్షోత్సవాలు సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), ఏలూరు నగరపాలక సంస్ధ మేయర్ షేక్ నూర్జాహాన్, నగరపాలక సంస్ధ కమీషనరు ఎ. భానుప్రతాప్ , కార్పోరేటర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది కలిసి మానవహారం నిర్వహించారు. అనంతరం పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రతిఒక్కరూ స్వభావ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాల్లో బాగస్వాములు కావాలని తెలిపారు. మన వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతపై సామాజిక స్పృహ కలిగియుండాలన్నారు. పరిశుభ్రత, ఆరోగ్యంపట్ల అవగాహన కార్యక్రమాలు ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. ఏలూరు జిల్లాలో అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టల్స్, పాఠశాలలు, కళాశాలలు, అన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణాన్ని కాపాడేందుకు పలు కార్యక్రమాలతోపాటు పారిశుధ్య సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛతను మన జీవన విధానంగా మార్చుకునేలా సమీష్టిగా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జాహాన్ మాట్లాడుతూ ఏలూరు నగరపాలక సంస్ధ 50 డివిజన్లలోను నేటి నుండి అక్టోబరు 2 వరకు 15 రోజుల పాటు స్వచ్ఛ భారత్ దివాస్ గా పాటిస్తున్నామన్నారు. స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత ఇతివృత్తంగా స్వచ్ఛతా హి సేవా 2024 నిర్వహించుకుంటున్నామన్నారు. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో బాగంగా పట్టణ ప్రజలందరూ ఈ 15 రోజులు నిర్వహించే కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి), మేయర్ షేక్ నూర్జాహాన్ లు పారిశుధ్య కార్మికులను కలిసి వారు చేస్తున్న పారిశుధ్య పనుల గురించి అడిగి వారికి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, పశుసంవర్ధక శాఖ జెడి జి. నెహ్రూబాబు, మైనారిటీస్ సంక్షేమం ఎడి ఎన్.ఎస్. కృపావరం, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ ఇ సత్యనారాయణ, కార్పోరేటర్లు, మున్సిపల్ హెల్త్ ఆపీసరు మాలతి, ప్రజా ప్రతినిధులు, ఆశా వర్కర్లు, వివిధ శాఖల సిబ్బంది, మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.