జిల్లాలో వివిధ శాఖల ద్వారా బహిరంగ ప్రదేశాలలో నిర్వహించుచున్న ర్యాలీలు, అవగాహన సమావేశాలు
ఏలూరు, సెప్టెంబర్, 18 : జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో జరిగే అవగాహనా కార్యక్రమాలు, ర్యాలీలు, మారథాన్, వంటి కార్యక్రమాల నిర్వహణలో ఆ ప్రాంతంలోని ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు వంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా బహిరంగ ప్రదేశాలలో నిర్వహించుచున్న ర్యాలీలు, అవగాహన సమావేశాలు, మారథాన్ వంటి కార్యక్రమాలు ఎక్కువగా ఉదయం ప్రజలు కార్యాలయాలకు వెళ్లే సమయాలలోనే ఎక్కువగా నిర్వహించడం జరుగుతుందని, అటువంటి సమయాలలో ఇటువంటి కార్యక్రమాల కారణంగా ట్రాఫిక్ రద్దీ తో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో నిర్వహించే ర్యాలీలు, అవగాహన వంటి కార్యక్రమాల కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఆయా కార్యక్రమాల వివరాలను ముందుగానే పోలీసు అధికారులకు తెలియజేసి వారి సమన్వయంతో ట్రాఫిక్ క్రమబద్దీకరించడం, ట్రాఫిక్ మల్లింపు వంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.