Close

స్వర్ణాంధ్ర@2047 సాధనలో అందరూ భాగస్వామ్యం కావాలి. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి మీ అభిప్రాయం తెలిజేయండి . జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

Publish Date : 24/09/2024

ఏలూరు,సెప్టెంబరు,24: స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన బృహాత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.

మంగళవారం స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ కు సంబంధించి తీసుకోవల్సిన చర్యలపై,స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహణ పై జిల్లా అధికారులు, తదితరులతో జిల్లా కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజలతోపాటు విజ్ఞులు, వివిధ భాగస్వామ్య పక్షాల నుంచి, విభిన్న రంగాల్లో విశిష్ట ప్రతిభ చూపే వ్యక్తులు, సంస్ధల తరపున ప్రతినిధులు, విద్యార్ధినీ విద్యార్ధులు తమ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇవ్వడం ద్వారా స్వర్ణాంధ్ర సాధనలో పాలు పంచుకోవాలన్నారు. గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక మహోన్నత లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిచేసే విధానంలో ప్రజల నుంచి అభిప్రాయసేకరణ చేపట్టడం జరిగిందన్నారు. అందులో మనజిల్లాలోని అన్ని వర్గాలకు చెందిన వారు స్వచ్ఛంధంగా పాల్గొన్నాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్ర ప్రభుత్వం రూపొందించిన క్యూ ఆర్ కోడ్ ను మీస్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేసి మీపేరు, ఫోన్ నెంబరు, ఇ-మెయిల్ ఇతర వివరాలు పొందుపర్చి అభిప్రాయాలు పంచుకోవాలని కోరారు. ప్రశ్నావళిలో ఇచ్చిన ప్రతిపాధనలను మీ ఐచ్చికం లేదా మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రజలు, ముఖ్యంగా విద్యార్ధినీ, విద్యార్ధులు పెద్ద సంఖ్యలో తమ అభిప్రాయాలు తెలియజేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

అదే విధంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలన్నారు. ప్రతిరోజు నిర్ధేశించిన కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించాలన్నారు. పారిశుధ్య కార్మికులకు సంబందించి ఆయా మున్సిపాలిటీల్లో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.