మధ్యాహ్నం భోజన పధకం మెనూ అభిప్రాయ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు, సెప్టెంబరు, 24: జిల్లాలో మధ్యాహ్నం భోజనం పకడ్బందీగా నిర్వహించడానికి నూరుశాతం విద్యార్ధులు మధ్యాహ్నం భోజన పధకాన్ని వినియోగించుకోవడానికి అవసరమైన మార్పులపై అభిప్రాయాన్ని తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలోరాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాల మేరకు మధ్యాహ్నం భోజన పధకాన్ని విద్యార్ధులు నూరు శాతం వినియోగించుకోవడానికి మెనూకు సంబంధించిన మార్పులు, చేర్పులపై జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ వారు, తల్లిదండ్రులు, కుక్కులతో, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో నూరుశాతం విద్యార్ధులు మధ్యాహ్నం భోజన పధకాన్ని వినియోగించుకుంటున్న స్కూల్ హెడ్ మాస్టర్ల యొక్క అభిప్రాయాన్ని ముందుగా తెలుసుకున్నారు. అలాగే బాగా మధ్యాహ్నం బోజన పధకంలో పూర్తిగా వెనుకబడిన పాఠశాలయొక్క సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సోమవారం నుంచి శనివారం వరకు మెనూలోను మార్పులపై వారియొక్క అభిప్రాయాలను ఒకొక్కరి దగ్గరి నుంచి సేకరించారు. మెనూలో పులిహోరను, సాంబారు బాత్ ను, ఐదురోజులిచ్చే బాయిలర్ కోడిగ్రుడ్డును, రాగిజావను, విద్యార్ధులు తినడానికి ఇష్టపడటంలేదని, దీనికి బదులుగా బాయిలర్ కోడిగ్రుడ్డును వేపుడుగా అలాగే సాంబార్ బాత్ కు బదులుగా అన్నం, సాంబారు విడి విడిగా అలాగే రాగిజావకు బదులుగా రాగిలడ్డును, పులిహోరను పూర్తిగా తొలగించి అన్నం ను మాత్రమే ఏర్పాటు చేసేలాగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో హాజరైన వారు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మీరిచ్చిన అభిప్రాయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలోని వంటశాలలు అపరిశుభ్రంగా ఉండటం, వండే పాత్రను పరిశుభ్రతగా చేయకపోవడం వల్ల కొన్నిచోట్ల ఆహారం విషతుల్యం అవుతుందని ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. వండిన ఆహారం నాణ్యతతో రుచితోకూడి వుంటే విద్యార్ధులు భుజించడానికి ముందుకు వస్తారని తెలిపారు. కోడిగ్రుడ్లలో నాణ్యత లోపిస్తే వెంటనే వాటిని తిరిగిపంపించాలని అన్నారు. నాణ్యతగల రైస్ ను మధ్యాహ్నం భోజనానికి పంపే విధంగా సివిల్ సప్లై అధికారి ఆర్ఎస్ఎస్ రాజును ఆదేశించారు. ప్రతి పాఠశాలలో హెడ్ మాస్టర్లు, టీచర్లు వండిన వంటను రుచిచూసి కుక్కు కు అవసరమైన సూచనలు ఇవ్వాలని తెలిపారు. మధ్యాహ్నం భోజన పధకంకు సంబంధించిన అంశాలపై వంటచేసే వారికి కోడిగ్రుడ్డు నాణ్యత పరీక్షించడానికి అవసరమైన శిక్షణను వచ్చే మాసంలో ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ షరీఫ్ ను కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో మండల విద్యాశాఖాధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రులు, స్కూలు మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు, కుక్కులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.