Close

జిల్లాలో ఉన్న (ఉమెన్ అండ్ చిల్డ్రన్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ )మహిళలు మరియు పిల్లల కొరకు నిర్వహిస్తున్న హోమ్ లు ఏమైతే ఉన్నాయో వాటన్నింటిని సమగ్రంగా దర్యాప్తు జరిపి నివేదిక ఇచ్చే విధంగా సంబంధిత కమిటీలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు.

Publish Date : 24/09/2024

ఏలూరు,సెప్టెంబర్ 24: జిల్లాలో ఉన్న (ఉమెన్ అండ్ చిల్డ్రన్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ )మహిళలు మరియు పిల్లల కొరకు నిర్వహిస్తున్న హోమ్ లు ఏమైతే ఉన్నాయో వాటన్నింటిని సమగ్రంగా దర్యాప్తు జరిపి నివేదిక ఇచ్చే విధంగా సంబంధిత కమిటీలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో చిల్డ్రన్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వహణ విధి విధానల పై జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ తో కలిసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ మధ్యకాలంలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకులు లేదా అందులో పనిచేసే సిబ్బంది అక్కడ ఉండే పిల్లల పైన చేసే వివిధ రకాల అకృత్యపు చర్యలు,చట్ట వ్యతిరేకమైన చర్యల వలన బాధింపబడుతున్న విషయాలు ను ఆధారంగా చేసుకొని భవిష్యత్తు లో ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి నిఘా వుంచే దిశగా జిల్లాలో ప్రత్యేకంగా జాయింట్ యాక్షన్ ప్లాన్ తయారుచేసి ఎన్సీపీ సీఆర్ గైడ్లైన్స్ ప్రకారం సిసిఐ లు హాస్టల్ లు,మరియు ఇతర ప్రైవేటు లేదా స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే హోమ్ లకు రిజిస్ట్రేషన్ లు ఏ విధంగా జరగాలి అనే వాటిపైన విధి విధానాలను తయారు చేసి వాటిని పటిష్టంగా అమలు జరిఫేందుకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి డీఈవో , చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధించి డిసిపిఓ , డిపిఓలతోను డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ తోను , ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పిడి తోను కలిపి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఈ సమావేశంలో సమీక్షించారు. మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసే విధంగా,పోలీసు శాఖ నుంచి ఎస్ హెచ్ ఓ ,జి ఎం ఎస్ కే, సిడిపిఓ , ఎంఈఓ లను పెట్టి ఒక కమిటీగా రూపొందించాలని నిర్ణయించారు. అదేవిధంగా వీటిలో హోమ్స్ నిర్వహించే వాళ్ళందరూ వాళ్ళ స్టాండర్డ్ ప్రమాణాలు అన్ని ఖచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ తనిఖీ సమయంలో తనిఖీ చేయవలసిన అంశాల పట్ల ఒక చెక్ లిస్ట్ కూడా తయారుచేయాలని సమావేశం నిర్ణయించింది.

సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కె. పద్మావతి, జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ కె. దుర్గాప్రసాద్ , జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి తదితరులు పాల్గొన్నారు.