Close

పిజిఆర్ఎస్ లో 239 అర్జీలు స్వీకరణ. జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి.

Publish Date : 07/10/2024

ఏలూరు, అక్టోబరు, 7: నాణ్యత ప్రమాణాలతో అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) కార్యక్రమం లో ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులను జిల్లా జాయింట్ కలెక్టర్ స్వీకరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, ఆర్డిఓ అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె. భాస్కర్, అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి 239 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. జిల్లా నుంచి వస్తున్న అర్జీదారుల అర్జీలు పూర్తి నాణ్యత ప్రమాణంతో పరిశీలించి ఎండార్స్ మెంట్ ఇవ్వాలని జెసి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పిజిఆర్ఎస్ కు సంబంధించిన నియమనిబంధనలు అధికారులు అవలంభించి అర్జీలు పరిష్కరించాలని సూచించారు. ఈ అర్జీల్లో భూమి తగాదాలు, హౌసింగ్, ల్యాండ్ సర్వే, పారిశుధ్యం, రోడ్లు, ఎలక్ట్రికల్, కో-ఆపరేటివ్ సొసైటీ తదితర వాటికి సంబంధించిన అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు.

అందిన అర్జీల్లో కొన్ని…
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పధకం ఏలూరు జిల్లాలోని లబ్దిదారులకు శిక్షణ ఏలూరు జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. శివకేశవరావు జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ ఫథకం పట్ల సాంప్రదాయ హస్తకళ కళాకారుల భాగస్వామ్యంతో అవగాహన కల్పించేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు. మండవల్లి మండలానికి చెందిన నాంచారయ్య లింగాల గ్రామంలో ఉన్న సుబ్బచెరువు పూర్తిగా కాలుష్యంగా మారి పశువులకు కూడా త్రాగడానికి నీరుకూడా లేకుండా ఉందని, ఈ చెరువులో వ్యర్ధాలు వేయకుండా చూడాలని కోరుతూ అర్జీ అందజేశారు. కొప్పాక గ్రామానికి చెందిన సురేష్ బాబు చికెన్ షాపు తన నివాసం ప్రక్కనే నిర్వహించడం వల్ల వ్యర్ధ పదార్ధాలతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు. టి. నర్సాపురం మండలం అల్లంచర్లరాజుపాలెం కు చెందిన విజయ రమేష్ తమ గ్రామంలో రామాలయం దగ్గర ఒక వ్యక్తి రోడ్డును ధ్వసం చేస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు. అయ్యప్పరాజుగూడెంకు చెందిన నాగయ్య తమ ఇంటి స్ధలంకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను ఇప్పించమని కోరుతూ అర్జీ అందజేశారు.
కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.