వయో వృద్ధుల సంక్షేమ చట్టాన్ని పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..
ఏలూరు, అక్టోబరు, 9: వయో వృద్ధుల సమాజానికి అమూల్యమైన సంపదని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ లో వయో వృద్ధుల సంక్షేమ చట్టం 2007 మరియు నిబంధనలు 2011 ప్రకారం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కలక్టర్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2007 లో ప్రభుత్వం వయోవృద్ధుల సంరక్షణకు చట్టం అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. 2011, 2022 లో ఆ చట్టాన్ని మరింత పటిష్టంగా సవరించడం జరిగిందన్నారు. వయో వృద్ధుల అభ్యున్నతికి మరియు వారి సమస్యల పరిష్కారానికి పలు సూచనలు మరియు జిల్లాలో వయో వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం నిర్దేశానుసారం జిల్లా కలక్టర్ వారు సంబంధిత అధికారులకు దిశా, నిర్ధేశం చేశారు. వయో వృద్ధుల సమస్యల పరిష్కారార్ధం జిల్లా యంత్రాగం విశేష కృషి చేసి వారికి చేదోడు వాదోడుగా నిలవాలని సూచించారు. సంబంధిత విషయమై పలు వయో వృద్ధుల అసోసియేషన్ వయో వృద్ధుల జిల్లా కమిటీ వారు హర్షం వ్యక్తం చేశారు.
సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి. రామ్ కుమార్ , ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజినల్ అధికారులు అచ్యుత అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. పాల్ సతీష్ కుమార్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. ఎస్. శర్మిష్ట, జిల్లా వయో వృద్ధుల జిల్లా కమిటీ సభ్యులు తదితరులు హాజరయ్యారు.