Close

100 రోజుల్లో నిర్ధేశించిన ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలు పూర్తిచేయాలి. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 09/10/2024

ఏలూరు, అక్టోబరు, 9: జిల్లాలో 100 రోజుల్లో నిర్ధేశించన ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలు ఖచ్చితంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలో ఇళ్ల నిర్మాణాల 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రగతిపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా రోజుకు కనీసం 54 ఇళ్లు నిర్మాణాలు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. అదే విధంగా స్టేజ్ కన్వర్షన్ సంబంధించి బేస్ మెంట్ లెవల్, రూప్ లెవల్ తదితర స్ధాయిల్లో పురోగతి ఉండాలన్నారు. యన్.టి.ఆర్. రూరల్ హౌసింగ్ కు సంబంధించి ఆయా ఇళ్ల పరిశీలన వారం రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణ అన్ని అంశాల్లోను జిల్లాను ముందంజలో ఉంచాలని సూచించారు.
సమావేశంలో హౌసింగ్ పిడి జి. సత్యనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.