జిల్లా ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర గనుల శాఖ కమీషనర్ మరియు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ కు తెలిపారు.
ఏలూరు, అక్టోబర్, 13: జిల్లా ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర గనుల శాఖ కమీషనర్ మరియు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ కు తెలిపారు. రాష్ట్రంలో నదీ తీరప్రాంతాలు, తదితర ప్రదేశాలలో ఇసుక తవ్వకాల టెండర్స్ ప్రక్రియ, జిల్లా ఇసుక కమిటీలలో ఆమోదించుట, సిసి కెమెరాల ఏర్పాటు, తదితర అంశాలపై గనుల శాఖ కమీషనర్ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా గనుల శాఖ కమీషనర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు. ఈనెల 16వ తేదీ నుండి రాష్ట్రంలోని నదీ తీరప్రాంతాలు, తదితర ప్రదేశాలలో ప్రారంభం కానున్న ఇసుక తవ్వకాలు విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ, జిల్లా ఇసుక కమిటీ లో ఆమోదం పనులు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఇసుక తవ్వక ప్రదేశాలలో సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షించాలన్నారు. ఇసుక ఎక్కడా అక్రమంగా తరలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి జిపిఎస్ కలిగిన వాహనాల ద్వారా అందిస్తున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా పటిష్టమైన నిఘా పెట్టామని ,ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటుచేశామని, సిబ్బందిని కూడా నియమించామన్నారు.
గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి. రవికాంత్, ప్రభృతులు పాల్గొన్నారు.