Close

ఈ నెల 22 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కంట్రోల్ రూమ్ ( నెంబర్లు 08812-230448, 7702003584, మరియు టోల్ ఫ్రీ 18004256453) ఏర్పాటు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి

Publish Date : 21/10/2024

ఏలూరు,అక్టోబర్ 21:ఏలూరు జిల్లాలో 2024-25 ఖరిఫ్ పంట కాలములో 1 లక్ష 80 వేల ఎకరాలలో వరి సాగు కాబడనట్లుగాను సుమారుగా 5 లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రావొచ్చునని, అందులో సుమారుగా 3 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేయువచ్చునని అంచనా వేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి తెలిపారు.

అందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారు నోడల్ ఏజెన్సీ గా వ్యవహరించున్న నేపద్యంలో ఏలూరు జిల్లాలో ప్రోక్యుర్మెంటు సపోర్టింగ్ ఏజన్సీలైన కొఅపరేటివ్ సొసైటిలు (PACS), (DCMS) మరియు రైతుల ఉత్పత్తి సంస్థల(FPOs)ల ద్వారా 250 ధాన్యం కొనుగోలు కేంద్రములను రైతు సేవా కేంద్రాల వద్ద అవసరమగు అన్ని సదుపాయములు మరియు సాంకేతిక సిబ్బందితో ఏర్పరిచి ముందస్తుగా ధాన్యం పట్టుబడి నిమిత్తం దాదాపుగా 12 లక్షల గోనె సంచులను ధాన్యం సేకరణకు సిద్దంగా ఉంచదమైనదన్నారు. జిల్లా ట్రాన్స్-పోర్ట్ అధికారి వారి వర్యవేక్షణలో లారీ యూనియన్లు, రైస్ మిల్లర్లు, మరియు ఇతర ప్రైవేటు వాహన యజమానుల ద్వారా జీపీఎస్ పరికము అమర్చిన వాహనాలను ఏర్పాటు చెయ్యడం జరుగుచున్నదన్నారు. అంతేకాకుండా రైతులు జీపీఎస్ పరికము గల వారి సోంత వాహనం ద్వారా తమ యొక్క ధాన్యమును రవాణా చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం ,వరి పండిచే రైతుల కళ్ళాల వద్ద నుండే కనీస మద్దతు ధరకు కొనుగోలూ చేయుటకు నిర్ణయించియున్నారన్నారు. అందులకు అవసరమగు అన్ని ఖర్చులు ప్రభుత్వం తరపున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారే పూర్తిగా భరిస్తారన్నారు.

ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రత్యేకముగా రైతుల యొక్క కళ్ళాల వద్ద నుండే ధాన్యం సేకరించిన ధాన్యమును ర్యాండమైజేషన్ పధ్దతిలో కాకుండా సమీపములోని రైస్ మిల్లులకు తరలించుట ద్వారా కొనుగోలు నిర్ణయించియున్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై పూర్తి పర్యవేక్షణకు అవసరమైన చోట్ల క్షేత్ర స్థాయిలో మండలల వారిగా ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై ఫోన్ ద్వారా రైతుల సందేహాలపై తగిన సలహాలు & సమాచారం పొందుటకు మరియు వారి యొక్క ఫిర్యాదులను చేయుటకు మరియు వాటి పరిష్కరం కొరకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ (కంట్రోల్ రూమ్ నెంబర్లు 08812-230448, 7702003584, మరియు టోల్ ఫ్రీ 18004256453) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు,
జిల్లాలో అక్టోబర్ 22వ తేది నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఏలూరు వారిచే కనీన మద్దతు ధర ఆనగా క్వింటాలుకు కామన్ రకమును రూ 2300 మరియు గ్రేడ్ ఏ రకమును రూ 2320 చొప్పున రైతులకు ఎటువంటి అసౌఖర్యం కలగకుండా ధాన్యం పట్టుబడి నిమిత్తం గోనె సంచులు మరియు రవాణా కొరకు జీపీఎస్ పరికరము అమర్పిచిన వాహనములు వంటి అన్ని ఏర్పాట్లు చేసి ధాన్యం కొనుగోలూ చేయుటకు నిర్ణయించియున్నారన్నారు. ఇందు నిమిత్తం అవసరమగు హమాలలీల ఖర్చులను , గొనె సంచుల వినియోగ రుసుమును ప్రభుత్వం వారే పూర్తిగా భరిస్తూ ధాన్యం ఖర్చుతో పాటుగా సంబందిత ఖాతాలకు చెల్లించబడునన్నారు. కనుక ఈ విషయములో అస్తక్తి గల రైతులు వారి సమీపములోని రైతు సేవా కేంద్రమును సంప్రదించి ప్రభుత్వం వారు అందిచు ఈ సదుపాయమును వినియోగించుకొని వారు పండించిన ధాన్యమున నియమ నిభంధనల ప్రకారం కనీస మద్దతు ధరకు విక్రయించు కొనవచ్చునన్నారు.