దేశ సమగ్రత ఐక్యతకు కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు,అక్టోబర్ 31: భారతజాతి గర్వించ దగ్గ వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు
నివాళులర్పించారు. విద్యార్థినిలందరి చేత సమైక్యత ప్రతిజ్ఞ నిర్వహించారు.తొలుత జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ లో పాల్గొన్న అందరిని కలెక్టర్ అభినందించారు.ఈ సందర్బంగా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జాతి ఐక్యతకు పునాదులు వేసిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు.దేశ సమగ్రత ఐక్యతకు కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సంకల్పాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ జెడి వి.జయప్రకాష్, డి ఎస్ డి ఓ బి. శ్రీనివాసరావు, స్కూల్ గేమ్స్ అసోసియేషన్ సెక్రెటరీ అలివేలు, ఎంఈఓ ఆర్ రంగయ్య,పలువురు విద్యార్థినిలు పాల్గొన్నారు.