Close

ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..

Publish Date : 30/10/2024

ఏలూరు, అక్టోబరు, 30: స్ధానిక కలెక్టరేట్ లో ఉన్న ఈవిఎం యంత్రాలు, వివిప్యాట్ లు భధ్రపరిచే గోడౌన్ ను బుధవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖిలో భాగంగా ఈవిఎం గోదాము యొక్క తాళములు, సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. అనంతరం సెక్యూరిటీ లాగ్ బుక్ ను పరిశీలించి అందులో సంతకం చేశారు. ఈవిఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.