Close

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

Publish Date : 29/10/2024

ఏలూరు, అక్టోబర్ 29 : జిల్లాలో జనవరి, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఎస్ఎస్ఆర్ -2025 డ్రాఫ్ట్ పబ్లికేషన్ ను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విడుదల చేశారు. ఈ సందర్బంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ఎస్ఆర్ -2025లో భాగంగా 16,38,436 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో పురుష ఓటర్లు 7,99,781 మంది, మహిళా ఓటర్లు 8,38,531 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 124 మంది ఉన్నారన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు డ్రాఫ్ట్ పబ్లికేషన్ ను విడుదల చేశామన్నారు.. ఈనెల 29వ తేదీ నుండి నవంబరు 28వ తేదీ వరకు క్లైయిమ్స్ అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందన్నారు. క్లైయిమ్స్ అభ్యంతరాలను డిశంబరు 24వ తేదీలోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. తుది ఓటర్ల జాబితాను (ఫైనల్ పబ్లికేషన్)ను 2025 జనవరి 6వ తేదీన ప్రచురించడం జరుగుతుందన్నారు. బూత్ స్ధాయిలో నవంబరు నెలలో ఎన్నికల కమీషన్ నిర్ధేశించిన శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపయిన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. బిఎల్ఓలు బూత్ వద్దే క్లైయిమ్ లను, అభ్యంతరాలను స్వీకరిస్తారన్నారు. ఈదృష్ట్యా రాజకీయ పక్షాల వారు బిఎల్ఎలను నియమించుకుంటే స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడానికి అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, నెరుసు నెలరాజు(బిజెపి), ఎస్. బాబూప్రసాద్(కాంగ్రేస్), డిఎన్ విడి ప్రసాద్(సిపిఐఎం), సిర్రా భరత్, డి. రత్నబాబు(బిఎస్పీ), యు. బాలానందం, ఎస్. అచ్యుత్ బాబు, టి. విష్ణు(టిడిపి), ఎ. రవి, పి. ఆదిశేషు(సిపిఎం) పాల్గొన్నారు.
జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గంలో 1,01,595 మంది పురుష ఓటర్లు, 1,04,930 మంది మహిళా ఓటర్లు, 06 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2,06,531 మంది ఓటర్లు ఉన్నారన్నారు. దెందులూరు నియోజకవర్గంలో 1,09,286 మంది పురుష ఓటర్లు, 1,15,388 మంది మహిళా ఓటర్లు, 08 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2,24,682 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఏలూరు నియోజకవర్గంలో 1,12,308 మంది పురుష ఓటర్లు, 1,22,714 మంది మహిళా ఓటర్లు, 46 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2,35,068 మంది ఓటర్లు ఉన్నారన్నారు. పోలవరం(ఎస్టీ) నియోజకవర్గంలో 1,22,959 మంది పురుష ఓటర్లు, 1,31,372 మంది మహిళా ఓటర్లు, 09 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2,54,340 మంది ఓటర్లు ఉన్నారన్నారు. చింతలపూడి(ఎస్సీ) నియోజకవర్గంలో 1,34,294 మంది పురుష ఓటర్లు, 1,38,778 మంది మహిళా ఓటర్లు, 40 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2,73,112 మంది ఓటర్లు ఉన్నారన్నారు. నూజివీడు నియోజకవర్గంలో 1,18,063 మంది పురుష ఓటర్లు, 1,20,863 మంది మహిళా ఓటర్లు, 10 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2,38,936 మంది ఓటర్లు ఉన్నారన్నారు. కైకలూరు నియోజకవర్గంలో 1,01,276 మంది పురుష ఓటర్లు, 1,04,486 మంది మహిళా ఓటర్లు, 05 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2,05,767 మంది ఓటర్లు ఉన్నారన్నారు.