జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసిన డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు…
Publish Date : 26/10/2024
ఏలూరు, అక్టోబరు, 26: ఏలూరు జిల్లా రెవిన్యూ అధికారిగా నియమితులైన వి. విశ్వేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారిని డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ జిల్లా రెవిన్యూ అధికారిగా బాధ్యతలు చేపట్టిన వి. విశ్వేశ్వరరావుకు అభినందనలు తెలియజేశారు. ఒంగోలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా పనిచేసిన వి. విశ్వేశ్వరరావు ఏలూరు జిల్లా రెవిన్యూ అధికారిగా నియమితులైనారు.