Close

ధరల నియంత్రణకు చర్యలు జాయింట్ కలెక్టర్ శ్రీమతి ధాత్రి రెడ్డి

Publish Date : 04/11/2024

ఏలూరు,నవంబర్ 4: వినియోగదారులకు స్థిరమైన ధరలకు నిత్యావసర వస్తువుల సరఫరాకు సంబంధించి ప్రభుత్వం సూచనలను జారీ చేసిందని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి తెలిపారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జయింటు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆయిల్, పప్పుధాన్యాలు, చక్కెర అసోసియేషన్ మరియు ఏలూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తో సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరా అధికారి, ఏలూరు, అసిస్టెంట్ డైరెక్టర్ , మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ,రైతు బజార్ ఎస్టేట్ అధికారులు మరియు లీగల్ మెట్రాలజి , ఫుడ్ సేఫ్టీ ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న
ఆయిల్, పప్పు దినుసుల, బియ్యం హోల్‌సేలర్ డీలర్స్ అసోసియేషన్ మరియు వారి ప్రతినిధులు ముందుకు వచ్చి, ప్రత్యేక కౌంటర్లు/స్టాల్స్ మరియు స్థానిక సౌకర్యాలు క్రింద సన్నబియ్యం మరియు కంది పప్పును, ఆయిల్ స్థిరమైన ధరలకు విక్రయిస్తామని హామీ ఇచ్చారు.

కందిపప్పు (దేశవాళీ వెరైటీ ) @ కేజీ Rs.150/-
(బహిరంగ మార్కెట్ ధర కేజీ Rs.170/- )
బిపిటి /సోనా మసూరి –ఫైన్ రైసు (స్టీము)కేజీ @ Rs.48/-
(బహిరంగ మార్కెట్ ధర .55/రు.కేజీ). బిపిటి/ సోనా మసూరి –ఫైన్ రైసు (రా రైసు)కేజీ @Rs.45/-
(బహిరంగ మార్కెట్ ధర.52./రు కేజీ)
4. సన్ ఫ్లవర్ ఆయిల్ @ ప్యాకెట్ Rs.124/-
(బహిరంగ మార్కెట్ ధర Rs.134/- ప్యాకెట్)
5. పామ్ ఆయిల్ ప్యాకెట్ @ Rs.120/-
(బహిరంగ మార్కెట్ ధర Rs.110/- )

ఈ సందర్బంగా జాయింటు కలెక్టర్ ధాత్రి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలను అమలు చేయడానికి, సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం మరియు కంది పప్పును మరియు ఆయిల్ విక్రయించడానికి జిల్లాలో ఇప్పటికే 32 ప్రత్యేక కౌంటర్లు రైతు బజార్లు,సూపర్ మార్కెట్స్ ,మాల్స్ ద్వారా ప్రజలకు సౌకర్యం కలిగించడం జరిగిందని తెలిపారు. ధరల నియంత్రణలో భాగంగా సామాన్య , మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంకా అవసరమయిన ప్రదేశాలలో మరికొన్ని కౌంటర్లను ప్రారంభించ వలసినదిగా జిల్లా పౌర సఫరా అధికారి ఆర్. ఎస్ ఎస్ సత్యనారాయణ రాజును ఆదేశించారు.