పిజిఆర్ఎస్ లో 236 అర్జీలు స్వీకరణ. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
Publish Date : 11/11/2024
ఏలూరు, నవంబరు, 11: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అందిన ఫిర్యాదుల పరిష్కారాన్ని నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 236 ధరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, డిప్యూటీ కలెక్టర్లు, భాస్కరరావు, మున్సిపల్ కమీషనరు ఎ. భానుప్రతాప్ లతో కలిసి ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై వేదికనుంచే జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కె. వెట్రిసెల్వి డివిజన్, మండలస్ధాయి అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశించారు. ఆయా సమస్య్లపై వేగంగా స్పందించి పరిష్కారం చూపాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వాటిని పరిష్కరించడంపై దృష్టిపెట్టాలన్నారు. అందిన ఫిర్యాదులను తక్షణమే నిష్పక్షకంగా, సమర్ధవంతంగా పరిష్కరించాలన్నారు. పరిష్కరించబడిన ఫిర్యాదులపై అర్జీదారుని సంతృప్తిని తెలుసుకునేందుకు వివిధ స్ధాయిల్లో పరిశీలన జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారులు విజ్ఞఫ్తులను అధికారులు క్షుణంగా పరిశీలించి రీఓపెనింగ్ లేకుండా చూడాల్సిన భాద్యత అధికారులపై ఉందని కలెక్టర్ సూచించారు.
అందిన అర్జీల్లో కొన్ని….
నిడమర్రు మండలం పెదనిండ్రకొలను చెందిన పెద్దిరాజు తమ గ్రామంలో కూలరాజు చెరువు ప్రభుత్వ అనుమతి లేకుండా చేపలు, రొయ్యిలు పెంపకంగా మార్చినారు. దీనిద్వారా గ్రామాల్లో కాలుష్యం పెరుగుతుంది. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు. పోలవరానికి చెందిన షేక్ అహ్మద్ భాషా తమకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు. కలిదిండి కి చెందిన వెంకటశివరామ్ తమ గ్రామంలో 100 మంది రైతులకు సంబంధించిన భూమిని 22ఎ రికార్డునుండి తొలగించాలని కోరుతూ అర్జీ అందజేశారు. కైకలూరు మండలం కోరుమిల్లు గ్రామానికి చెందిన అప్పారావు తన సొంతభూమిని సర్వేచేయించి హద్దులను గుర్తించాలని కోరుతూ అర్జీ అందజేశారు. కలిదిండి మండలం తాళ్లపాలెం కు చెందిన దివ్యాంగుడైన తనకు ప్రభుత్వం కల్పిస్తున్న పెన్షన్ ను ఇప్పించవలసిందిగా అర్జీ అందజేశారు.
సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ సెక్షన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.