57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.. ఈనెల 14 నుండి 20 వ తేదీ వరకు
ఏలూరు,నవంబర్ 12: 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లను కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు.
మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో ఈ నెల 14 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు నిర్వహించే వారోత్సవాలకు సంబంధించి గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.
జిల్లా కేంద్ర గ్రంధాలయం సంస్థ కార్యదర్శి యం.శేఖర్ బాబు ఈ నెల 14వ తేదీన బాలల దినోత్సవం తో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 15 న పుస్తక ప్రదర్శన మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ పై అవగాహన,పుస్తక పఠనం పై కార్యక్రమాలు,16 న గ్రంథాలయ ఉద్యమకారులను స్మరించుట,17 న కవి సమ్మేళనం,18 న విద్యార్థులకు వ్యాసరచన , వక్తృత్వ వ్యాసరచన, క్రీడా పోటీల నిర్వహణ 19 న మహిళా దినోత్సవం,20 న డిజిటల్ గ్రంథాలయాలపై విద్యార్థులకు అవగాహన వారోత్సవాల ముగింపు కార్యక్రమలతో వారోత్సవాలు ముగుస్తాయని కార్యదర్శి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ ఎ. నారాయణరావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ వి. టి. సందీప్ కుమార్ కార్యాలయ సిబ్బంది శ్యాంబాబు,కుమార్ పాల్గొన్నారు.