విద్యతోనే బాల కార్మిక వ్యవస్ధ నిర్మూలన. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు, నవంబరు, 20: బాలకార్మిక వ్యవస్ధను, బాల్య వివాహాలను సమూలంగా నిర్మూలించేందుకు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. స్ధానిక జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో బుధవారం బాలకార్మిక వ్యవస్ధ నిర్మూలనపై రూపొందించిన గోడ పత్రికను జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరంతర పర్యవేక్షణతో ఏలూరు జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా నిలపాలని జిల్లా టాస్క్ ఫోర్సు అధికారులకు సూచించారు. బాలకార్మిక వ్యవస్ధను సమూలంగా నిర్మూలించాలంటే విద్యతోనే సాధ్యమని ఆ దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. బాల కార్మికులను గుర్తించి బడిలో చేర్పించాలన్నారు. బాలల హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యతన్నారు. బాలకార్మిక వ్యవస్ధ నిర్మూలనకు స్వచ్ఛంధ సేవా సంస్ధలు, యువత తమ వంతు సహకారం అందించాలన్నారు.
ఉప కార్మిక కమిషనరు పి. శ్రీనివాస్ మాట్లాడుతూ బాల కౌమార కార్మికులను గుర్తించుట , పునరావాసం కల్పించేందుకు పాన్ఇండియా ప్రచారోధ్యమంలో బాగంగా కార్మిక శాఖ కమీషనరు మరియు జిల్లా కలెక్టరు, జిల్లా టాస్క్ ఫోర్సు కమిటీ చైర్మన్ వారి ఆదేశాల మేరకు గత నెల 21వ తేదీ నుంచి ఈనెల 20వ తేదీ వరకు బాల, కౌమార కార్మికులను గుర్తించుట, పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక తనిఖీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించామన్నారు. ఈ సందర్బంగా 3 కేసులను కూడా నమోదు చేయడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో జిల్లా విధ్యాశాఖఅధికారి వెంకటలక్ష్మమ్మ, ఐసిడిఎస్ పిడి కె. పద్మావతి, కర్మాగారములశాఖ ఇనస్పెక్టర్ శ్రీనివాస్, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతి ప్రియ , , చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్ ప్రతినిధి రవికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు , స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.