ప్రతిపాదిత పోలింగ్ స్టేషన్లో పై రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన డిఆర్ఓ విశ్వేశ్వరరావు
ఏలూరు, నవంబరు, 18: ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏలూరు జిల్లాలో మొత్తం 82 పోలింగ్ కేంద్రాలు ప్రతిపాధించడం జరిగిందని జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు తెలిపారు.
సోమవారం స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో సంబంధిత పోలింగ్ కేంద్రాల ప్రతిపాధనలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ విశ్వేశ్వరరావు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎన్. నెలరాజు(బిజెపి), ఆర్. సత్యనారాయణ(ఆమ్ ఆద్మీపార్టి), యు. బాలానందం, ఎస్. అచ్యుతబాబు(టిడిపి), పి. కిషోర్(సిపిఎం), డి. రత్నబాబు, ఎస్. భరత్ రావు(బిఎస్ పి), రాజనాల రామ్మోన్ రావు(ఐఎన్ సి), ఎం. వెంకటనాగరాజు(జెఎస్ పి) పాల్గొన్నారు.
ఈ సందర్బంగా డిఆర్ఓ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి పట్టభధ్రుల నియోజకవర్గానికి ఏలూరు జిల్లాలో ఏలూరు డివిజన్ లో 33, నూజివీడు డివిజన్ లో 6, జంగారెడ్డిగూడెం డివిజన్ లో 23 పోలింగ్ కేంద్రాలు ప్రతిపాధించడం జరిగిందన్నారు. అదే విధంగా ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గానికి ఏలూరు జిల్లాలో ఏలూరు డివిజన్ లో 8, నూజివీడు డివిజన్ లో 20 పోలింగ్ కేంద్రాలు ప్రతిపాధించడం జరిగిందన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి నవంబరు 23వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించబడుతుందన్నారు. అనంతరం ఈనెల 23 నుంచి డిశంబరు 9వ తేదీ వరకు క్లైయిమ్ లు, అభ్యంతరాలు సమర్పించవచ్చన్నారు. డిశంబరు 30వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటించబడుతుందన్నారు. ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి పట్టభధ్రుల నియోజకవర్గానికి ఏలూరు జిల్లాకు ఇంతవరకు 40,890 ధరఖాస్తులు రాగా ఇంతవరకు 35,263 ఈఆర్ఓ లాగిన్ లో అప్ లోడ్ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గానికి సంబంధించి ఏలూరు జిల్లాలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా 16,258 ధరఖాస్తులు రాగా ఇంతవరకు 9,673 పరిశీలించడం పూర్తయిందన్నారు. ఈనెల 23వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం ఏవైనా డూప్లికేట్, ఇతర క్లైయిమ్ లు ఉంటే తమ దృష్టికి తీసుకురావచ్చని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆయన సూచించారు.